Begin typing your search above and press return to search.

OG: అసలు కథ ఇదేనా?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ఓజీ మూవీ స్టోరీ లైన్ అంటూ సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 11:00 AM GMT
OG: అసలు కథ ఇదేనా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని సుజిత్ సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. ఓజీ మూవీపై రోజుకో టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ఓజీ మూవీ స్టోరీ లైన్ అంటూ సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఓజీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అందులో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ముంబై నేపథ్యంలో కథ నడుస్తుందని స్పష్టం అయ్యింది. అలాగే వాయిస్ ఓవర్ బట్టి కట్టి పవన్ కళ్యాణ్ మాఫియాని వదిలేసి పదేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగొచ్చి తన శత్రువుల మీద రివేంజ్ తీర్చుకుంటాడని చెప్పబండింది.

ముంబై మాఫియా గ్యాంగ్ స్టార్స్ అందరికి లీడర్ గా ఉండే ఒజాస్ గంబీరా కొన్ని కారణాల వలన దానికి దూరంగా ఉంటాడు. అయితే పదేళ్ళ తర్వాత మరల మాఫియాలోకి అడుగుపెట్టి తన శత్రువులు అందరిని మట్టుబెడతాడు. ఈ స్టొరీ లైన్ ఐఎండిబి వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ వెబ్ సైట్ లో ఏదో గెస్ చేసి రాసిందే తప్ప ఒరిజినల్ ఉండదు అని టాక్.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న స్టొరీ లైన్ ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో కొంత వరకు వాస్తవం ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. సుజిత్ ఒజీ చిత్రాన్ని హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరపై ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి కచ్చితంగా పవర్ ఫుల్ ఎలివేషన్ సీక్వెన్స్ తో పాటు మంచి ఎమోషనల్ బ్లాక్స్ కూడా మూవీలో ఉండే అవకాశం ఉంది.

సాహోలో మిస్ అయిన అంశాలు ఈ చిత్రంలో సుజిత్ సరిచేసుకొని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా చూపించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. దసరా రేసులో ఈ మూవీలో థియేటర్స్ లోకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత మరల ఒజీ షూటింగ్ షెడ్యుల్ స్టార్ట్ చేయడానికి ప్రణాళిక వేసుకుంటున్నారు.