Begin typing your search above and press return to search.

వర్షాకాలంలో హీటు పెంచుతోన్న తమన్నా..!

తాజాగా తన యద అందాలు మొత్తం స్పష్టంగా కనిపించేలా అందాల ను ప్రదర్శించింది.

By:  Tupaki Desk   |   27 July 2023 12:30 PM GMT
వర్షాకాలంలో హీటు పెంచుతోన్న తమన్నా..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన వారి లో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం తమన్నా మంచి జోరు మీద ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తన దృష్టి మొత్తం వెబ్ సిరీస్ లపై పెట్టింది. ఇప్పటికే వరసగా రెండు వెబ్ సిరీస్ లలో మెరిసింది. రెండింటిలోనూ తన నటనతో,బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంది.


కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, ఈ బ్యూటీ లస్ట్ స్టోరీస్ తర్వాత తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది. కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే కాదు, సోషల్ మీడియా లోనూ తన లోని హాట్ యాంగిల్ ని బయటపెట్టి, ఆ ఫోటోలు షేర్ చేస్తోంది.

తాజాగా తన యద అందాలు మొత్తం స్పష్టంగా కనిపించేలా అందాల ను ప్రదర్శించింది. దానికి కావాలా అంటూ క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం. ఆమె ఫోటోకి బాయ్ ఫ్రెండ్ విజయ్ కూడా స్పందించాడు. వర్షాకాలం లో హీట్ పెంచుతున్నావ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా, ప్రస్తుతం తమన్నా రజినీకాంత్ సరసన జైలర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందు లో ఆమె నటించిన కావాలయ్య పాట ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.

తమిళం లోనే కాకుండా, తెలుగు లోనూ విడుదల చేశారు. ఈ రెండు భాషల్లోనూ పాట బాగా క్లిక్ అయ్యింది. ఎవరినోట చూసినా ఇదే పాట వినపడుతోంది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌ లో వస్తున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. జైలర్‌ మూవీ లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు తమన్నా , చిరంజీవి భోళా శంకర్ మూవీ లోనూ నటించింది. ఇక, ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ నుంచి ఇటీవల మిల్కీ బ్యూటీ అనే పాట విడుదల చేశారు. అందులో తమన్నా అందాల కు అందరూ మెస్మరైజ్ అయిపోయారు.