Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ల అభిమాన స్టార్లు వీళ్లే!

టాలీవుడ్ లో అలాంటి కొన్ని స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్స్ ఉన్నాయి. రాజ‌మౌళి-ఎన్టీఆర్...త్రివిక్ర‌మ్-బ‌న్నీ.. బోయ‌పాటి-బాల‌య్య ఇలా కొంద‌రున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:15 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ల అభిమాన స్టార్లు వీళ్లే!
X

స్టార్ డైరెక్ట‌ర్లు ఎంత మంది హీరోల‌తో సినిమాలు చేసినా వాళ్ల‌కంటూ కొంద‌రు ప్ర‌త్యేక‌మైన హీరోలు.. అభిమానించే హీరోలుంటారు. వాళ్ల‌తో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. టాలీవుడ్ లో అలాంటి కొన్ని స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్స్ ఉన్నాయి. రాజ‌మౌళి-ఎన్టీఆర్...త్రివిక్ర‌మ్-బ‌న్నీ.. బోయ‌పాటి-బాల‌య్య ఇలా కొంద‌రున్నారు.

రాజ‌మౌళి అభిమానించే హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ . జ‌క్క‌న్న ఎంత మంది హీరోల‌తో సినిమాలు చేసినా? త‌ను మెచ్చిన ఒకే ఒక్క న‌టుడు ఎన్టీఆర్. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో జ‌క్క‌న్న రివీల్ చేసారు. ఎలాంటి క‌థ‌ల్లోనైనా...పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోయే న‌టుడ‌ని జ‌క్క‌న్న అభిప్రాయం. అందుకే ఎన్టీఆర్ తో 'స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్'..' సింహాద్రి '..'య‌మ‌దొంగ‌'.. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలు చేయ‌గ‌లిగారు.

ఆ నాలుగు భారీ విజ‌యం సాధించిన చిత్రాలే. భ‌విష్య‌త్ లో ఈ కాబినేష‌న్ లో మ‌రిన్ని వండ‌ర్స్ రానున్నాయి. అలాగే త్రివిక్ర‌మ్-బ‌న్నీ కాంబినేష‌న్ అలాంటింది. బ‌న్నీ న‌ట‌నంటే గురూజీ బాగా అభిమానిస్తాడు. అత‌డి టైమింగ్ పెర్పామెన్స్ ని ఇష్ట‌ప‌డ‌తాడు. త్రివిక్ర‌మ్ క‌థ‌ల‌కి బ‌న్నీ ఈజీగామౌల్డ్ అవుతాడు. అలా ఆ ఇద్ద‌రి కాంబోకి తిరుగులేదు. 'జులాయి'..' స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి'..'అల వైంకుఠ‌పుర‌మ‌లో' లాంటి స‌క్సెస్ సినిమాలొచ్చాయి. అలాగే సుకుమార్ కూడా బ‌న్నీకే ఓటేస్తారు.

బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే దానికి కార‌ణంగా అత‌ని ప్ర‌తిభ‌తో పాటు..సుకుమార్ లాంటి ద‌ర్శ‌కుడు వెనుకుండ‌ట‌మే. 'ఆర్య‌'..'ఆర్య‌-2'.. 'పుష్ప' లాంటి విజ‌యాలు బ‌న్నీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఎంత మంది హీరోల‌తో సినిమాలు చేసినా న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తే వ‌చ్చే కిక్కే వేరు. 'సింహ‌'..'లెజెండ్'..'అఖండ' లాంటి విజ‌యాలు వ‌చ్చాయంటే? పెద్ద లాజిక్ వెత‌కాల్సిన ప‌నిలేదు. బాల‌య్య‌ని తెర‌పై ఎలా చూపించాలో బోయ‌పాటికి తెలిసినంత‌గా ఇండియాలో ఏ డైరెక్ట‌ర్ కి తెలియ‌దన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకే 'అఖండ‌-2' కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేష‌న్ లో బాక్సాఫీస్ షేక్ అయ్యే సినిమాలెన్నో వ‌స్తాయి.