Begin typing your search above and press return to search.

ఆ కాంబినేష‌న్ లో సినిమా అట‌కెక్కిన‌ట్లేనా?

టాలీవుడ్ లో ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో ఓ ర‌చ‌యిత‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ర‌చ‌యిత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో చెప్పుకున్నాడు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:30 PM GMT
ఆ కాంబినేష‌న్ లో సినిమా అట‌కెక్కిన‌ట్లేనా?
X

ఠెంకాయ కొట్టిన సినిమాలే ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు సంగం షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆగిపోతున్నాయి. ఇంకొన్ని రిలీజ్ కి ఆట‌కం ఏర్ప‌డి ఆగిపోతున్నాయి. వాటిక‌న్నా ఇలా ప్రారంభం కాకుండా నే ఆగిపోవ‌డం మంచిదేగా. ఆ కార‌ణంగా నిర్మాత సేవ్ అవుతాడు. అలా కాక‌పోతే అడ్డంగా బుక్కైదే నిర్మాతే క‌దా. ఇంత‌కీ ఈ స్టోరీ అంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అయితే మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే.

టాలీవుడ్ లో ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో ఓ ర‌చ‌యిత‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ర‌చ‌యిత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో చెప్పుకున్నాడు. తొలి సినిమా అవ‌కాశ‌మే పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డంతో సంతోషంలో ఉబ్బిత‌బ్బిబ్బాడు. ఆ ర‌చ‌యిత క‌థ‌లు అందించిన సినిమాల‌న్నీ కూడా మంచి విజ‌యం సాధించాయి. అత‌ని క‌థ‌ల్లో క‌మ‌ర్శియాల్టీ కి కాసుల వ‌ర్షం కురిసింది.

దీంతో ఆ స్టార్ హీరో అదే కాన్పిడెన్స్ తో ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అప్ డేట్ ఏంటి? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ కాన‌రాలేదు. తాజాగా ఆ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఈ సినిమా ర‌ద్దైంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ర‌చ‌యిత‌- హీరో మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తిన‌ట్లు వినిపిస్తోంది. ఈ విష‌యంలో ర‌చ‌యిత హీరోని మోసం చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆ హీరోకి అత‌ను వినిపించింది సొంత క‌థ కాద‌ని ఓ మ‌ల‌యాళ సినిమా క‌థ అని హీరోకి లాంచ్ కి వెళ్దాం అనుకుంటోన్న స‌మ‌యంలో తెలిసిందిట‌.

అప్ప‌టికే ఆ సినిమా హ‌క్కులు ఓ బ‌డా నిర్మాత లాక్ చేసారుట‌. ఆయ‌న ద్వారానే హీరోకి విష‌యం తెలిసిందిట‌. ఆ త‌ర్వాత ర‌చ‌యిత‌కి క‌బురు పెట్టి పిలిపించి మాట్లాడ‌గా అసలు సంగ‌తి తెలిసిందిట‌. దీంతో ఆ హీరో సినిమా చేసే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళం స్టోరీ అయినా హీరోని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసినా హీరో అంగీక‌రించ‌లేదుట‌. ఇటీవ‌లే ఆ హీరో ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీంతో ఆ ర‌చ‌యిత ప‌రిస్థితి ఏంటి? అని ఆరా తీయ‌గా ఈ క‌థంతా లీకైంది.