Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ రిజల్ట్ డబుల్ ఎనర్జీతో స్టార్ హీరో..!

కానీ సినిమా సంక్రాంతి హిట్ సినిమాల్లో ఒకటిగా నిలబడేలా వసూళ్లు అదరగొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:18 PM GMT
సూపర్ హిట్ రిజల్ట్ డబుల్ ఎనర్జీతో స్టార్ హీరో..!
X

కింగ్ నాగార్జున సినిమా హిట్ కొడితే బాక్సాఫీస్ సందడి ఎలా ఉంటుందో సంక్రాంతికి వచ్చిన నా సామిరంగ కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సంక్రాంతికి హడావుడిగా రిలీజైన సినిమా ఇదే. ఏదో సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేయాలన్న ఆలోచనతో 3 నెలల్లో చుట్టేశారన్న టాక్ వచ్చింది. కానీ సినిమా సంక్రాంతి హిట్ సినిమాల్లో ఒకటిగా నిలబడేలా వసూళ్లు అదరగొడుతున్నాయి. తన సీనియారిటీ ఈ సినిమా విషయంలో నూటికి నూరు పాళ్లు పనిచేసినందుకు నాగార్జున కూడా సూపర్ హ్యాపీగా ఉన్నాడు.

సీనియర్ అయినా జూనియర్ అయినా స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ఒక హిట్ సినిమా ఇచ్చే జోష్ ఉత్సాహం వేరే లెవెల్ లో ఉంటుంది. అది కూడా సంక్రాంతికి పందెం కోడిలా వచ్చి సినిమా సక్సెస్ కొడితే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున జోష్ అలానే ఉంది. సంక్రాంతికి తన ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అందించి మరోసారి సంక్రాంతి సీజన్ తనకు ఎలా కలిసి వస్తుందో చూపించాడు కింగ్. అంతకుముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా టైపులో నాగార్జున నా సామిరంగ వసూళ్లు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున సినిమాల లెక్క కూడా మారుతుందని చెప్పొచ్చు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో నా సామిరంగ సినిమాతో క్లియర్ కట్ గా అర్థమైంది. సో ఇక మీదట నాగార్జున ఇలాంటి సినిమాలే చేస్తాడని చెప్పొచ్చు. నాగ్ మార్క్ రొమాంటిక్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తే ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రియులకు అది నచ్చేస్తుంది. అందుకే నాగార్జున కూడా ఇక మీదట ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలకే ఓటు వేయాలని చూస్తున్నారట.

ఫ్యామిలీ స్టోరీస్ లోనే డిఫరెంట్ కథలను చెప్పాలని అనుకుంటున్నారట. ఎలాగు సంక్రాంతికి కలిసి వస్తున్న సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ప్రతి పొంగల్ కి ఒక ఫ్యామిలీ మూవీ ప్లాన్ చేస్తే అదిరిపోతుందని నాగార్జున అనుకుంటున్నారు. ఐతే నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ దిల్ రాజు శతమానం భవతి నెక్స్ట్ పేజీ రెడీ చేస్తున్నారు. ఈలోగా నాగార్జున సినిమా వస్తే బెటర్. ఏది ఏమైనా కింగ్ నాగార్జున కొన్నాళ్లుగా చేస్తున్న బాక్సాఫీస్ ఫైట్ లో నా సామిరంగ సక్సెస్ కింగ్ కి ఒక క్లారిటీ తెచ్చిందని చెప్పొచ్చు.