Begin typing your search above and press return to search.

ఆ హీరో కొట్ట‌క‌పోతే క‌ష్టాలేనా?

అయితే కొంత కాలంగా అత‌డి సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 2:30 PM GMT
ఆ హీరో కొట్ట‌క‌పోతే క‌ష్టాలేనా?
X

ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో పాటు..క‌మ‌ర్శియ‌ల్ జోన్ లో సినిమాలు చేస్తోన్న హీరో ఇప్పుడు బ్యాడ్ పేజ్కి అతి చేరువ‌లో ఉన్నాడా? త‌దుప‌రి సినిమా తో కొట్ట‌క‌పోతే క‌ష్టాలు త‌ప్ప‌వా? ఇప్ప‌టికే మార్కెట్ పై ఆ ప్ర‌భావం ప‌డుతోందా? అంటే అవున‌నే గుస గుస వినిపిస్తుంది. టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన హీరో ప్ర‌యోగా ల‌తో పాటు క‌మ‌ర్శియ‌ల్ జోన‌ర్ లోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అయితే కొంత కాలంగా అత‌డి సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. అవ‌కాశా లైతే వ‌స్తున్నాయి గానీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌లేక‌పోతున్నాడు. ఇప్ప‌టికే అత‌డికి స‌క్సెస్ వ‌చ్చి మూడే ళ్లు దాటిపోతుంది. మ‌ధ్య‌లో నాలుగు సినిమాల్లో ఒక సినిమా యావ‌రేజ్ గా ఆడ‌గా మిగ‌తా సినిమాలు ఆశిం చిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో ఇప్పుడు సెట్స్ లో ఉన్న ఓ సినిమాకి బ‌డ్జెట్ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు స‌మాచారం.

హీరో మార్కెట్ ని మించి స్టోరీ బ‌డ్జెట్ డిమాండ్ చేయ‌డంతో ఇప్పుడు అత‌డిపై అంత‌ పెట్టాలా? లేదా? అన్న డైల‌మాలో నిర్మాత‌లున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి వాస్త‌విక‌త ఉట్టిప‌డేలా భారీ సెట్లు నిర్మించారు. వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా అవ‌స‌రం మేర చాలా సెట్లు నిర్మించాల్సి ఉంది. పాత కాలం నాటి వాతావ‌ర‌ణం తీసుకురావాల్సిన సెట్లు కావ‌డంతో ఆర్ట్ వ‌ర్క్ కి కూడా ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్టింది.

ఇప్పుడు నిర్మాణ ప‌రంగా అనుకున్న దానికంటే రెండింత‌లు ఎక్కువ ఖ‌ర్చు అవుతుందిట‌. దీంతో రిస్క్ తీసుకోవ‌డానికి నిర్మాత‌లు ప్ర‌స్తుతానికి సిద్దంగా లేర‌ని తెలిసింది. ఆ రిస్క్ తీసుకోవాలంటే తాజా సినిమా ఫ‌లితం నిర్దేశిస్తుంద‌ని అంటున్నారు. ఆ సినిమా గ‌నుక స‌క్సెస్ అయితే హీరో మార్కెట్ ప‌రంగా పుంజుకోవ డానికి అవ‌కాశం ఉంటుంది. అప్పుడు నిర్మాత‌ల చేతుల్లో డ‌బ్బులేక‌పోయినా పైనాన్ష‌ర్లు ముందుకు రావ డానికి అవ‌కాశం ఉంది. అందుకే స‌ద‌రు నిర్మాత‌లు ముందే అలెర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.