Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోలిద్ద‌రు అంత క్లోజ్!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ ఖాన్...షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టించ‌డం గురించి ఆసక్తిర విష‌యాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 6:00 AM GMT
ఆ స్టార్ హీరోలిద్ద‌రు అంత క్లోజ్!
X

బాలీవుడ్ స్టార్ హీరోలు స‌ల్మాన్ ఖాన్-షారుక్ ఖాన్ స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు ఒకే త‌రం నటులు. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో అభిమానం. అందుకే క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌స్తే మిస్ చేసుకోరు. ఇద్ద‌రు మ‌ల్టీస్టార‌ర్ చేసింది లేదు గానీ..ఒక‌రు చిత్రాల్లో ఒక‌రు న‌టించిన సంద‌ర్భాలున్నాయి. షారుఖ్ ఖాన్ క‌థానా యకుడిగా న‌టించిన 'ప‌ఠాన్' లో భాయ్ అతిదిగా మెరిసిన సంగ‌తి తెలిసిందే.


ప్ర‌తిగా స‌ల్మాన్ కోసం ఆయ‌న హీరోగా న‌టించిన 'టైగ‌ర్ -3' లో షారుక్ ఖాన్ మెరిసాడు. ఇలా ఇద్ద‌రు స్టార్లు ఒకే ప్రేమ్ లో క‌నినిపించే స‌రికి అభిమానుల ఆనందానిక అవ‌దులుండ‌వ్. బాలీవుడ్ లో ఈ క‌ల్చ‌ర్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఇప్పుడింకా మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో మార్కెట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు మ‌రింత క‌సిగా ప‌నిచేస్తున్నారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ ఖాన్...షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టించ‌డం గురించి ఆసక్తిర విష‌యాలు పంచుకున్నారు. 'మా ఇద్ద‌రి స్నేహం తెర‌పై కంటే తెర వెనుక ఇందా ధృడంగా ఉంటుంది. తెర మీద‌న ఇంత బాగా కుదిరిందంటే? తెర వెనుక ఇంకెంత బ‌లంగా ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. క‌ర‌ణ్ అర్జున్ సినిమా నుంచే ఆ అనుబంధం ఎలా ఉండేదో మీకు తెలుసు. మా బంధాన్ని చూసి అభిమానులు మ‌మ్మ‌ల్ని షోలో సినిమాలో జై..వీరు పాత్ర‌ల‌తో పోల్చుతారు.

ఇప్ప‌టికీ ఇద్ద‌రం ఒకేసారి ప‌బ్లిక్ లో క‌నిపించే స‌రికి ఆనాటా జ్ఞాప‌కాల్లోకి అభిమానుల‌తో పాటు మేము కూడా వెళ్లిపోతాం' అని అన్నారు. ఇక ఈ జోడీ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే 'ప‌ఠాన్ వ‌ర్సెస్ టైగ‌ర్' అంటూ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ఇద్ద‌రు ఒక‌రికొక‌రు త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. స్నేహితులుగా చూసిన ఖాన్ భాయ్ ల్ని బ‌ద్ద శ‌త్రువుల్లా చూసే అవ‌కాశం ఉంది.