Begin typing your search above and press return to search.

రూ.300 కోట్ల విలువైన మొనగాళ్ళు వీరే

సౌత్ ఇండియా డామినేషన్ రోజు రోజుకి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పెరుగుతుందని చెప్పాలి

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:01 AM GMT
రూ.300 కోట్ల విలువైన మొనగాళ్ళు వీరే
X

సౌత్ ఇండియా డామినేషన్ రోజు రోజుకి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పెరుగుతుందని చెప్పాలి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే మాట వినిపించేది. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ స్టార్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అత్యధికంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరకేక్కుతున్నది సౌత్ లోనే కావడం విశేషం. ఇండియన్ కథలని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లడంలో సౌత్ హీరోలు, దర్శకులు సక్సెస్ అవుతున్నారు.

బాలీవుడ్ అయితే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న పూర్తిగా ఇండియన్ కల్చర్ కి దూరంగా మూవీస్ ఉంటున్నాయి. తాజాగా వచ్చిన గద్దర్ 2, OMG 2 ఇండియన్ లో ఇండియన్ కల్చర్ పెర్ఫెక్ట్ గా ఉండటంతో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. అయితే 300 కోట్ల కలెక్షన్స్ అందుకునే సత్తా ఉన్న హీరోలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరున్నారని చూసుకుంటే ప్రస్తుతం ముగ్గురే కనిపిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, ఆదిపురుష్ చిత్రాలు 300 కోట్ల క్లబ్ చాలా ఈజీగా చేరిపోయాయి. సినిమాలకి డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. దీని బట్టి ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్ లోకి తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ వచ్చారు.

విజయ్ వరుస సక్సెస్ లతో చాలా సునాయాసంగా 300 కోట్ల కలెక్షన్స్ ని తన సినిమాలతో అందుకుంటున్నాడు. తమిళంలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అతని బిగిల్, వారిసు సినిమాలు 300 కోట్ల క్లబ్ లో చేరాయి. వీరి తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారని చెప్పాలి. ఎప్పుడో రోబో 2.ఓతోనే 300 కోట్ల క్లబ్ లో చేరిన సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమాలు ఆశించిన సక్సెస్ సాధించలేదు.

మరల జైలర్ మూవీతో వారం రోజులు కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు కొల్లగొట్టారు. ఈ చిత్రంతో కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. వీరి తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ జాబితాలోకి చేరే ఛాన్స్ ఉంది. పుష్పతో ఇప్పటికే 300 కోట్ల మార్క్ అందుకున్నారు. పుష్ప 2 కూడా అదే స్థాయిలో బిజినెస్ జరగనుంది. అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ ఈ క్లబ్ లో చేరే స్కోప్ ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగు దూరంలో ఉన్నారు.