Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలంటే ఈమాత్రం ఉంటది మరి

హీరోలుగా రాణిస్తున్న వారు సొంతంగా అభిమానగణం సంపాదించుకోవడం గౌరవంగా భావిస్తారు.

By:  Tupaki Desk   |   15 April 2024 5:09 AM GMT
టాలీవుడ్ హీరోలంటే ఈమాత్రం ఉంటది మరి
X

హీరోలుగా రాణిస్తున్న వారు సొంతంగా అభిమానగణం సంపాదించుకోవడం గౌరవంగా భావిస్తారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ తమ హీరోలని డెమీ గాడ్స్ గా ఆరాధిస్తూ ఉంటారు. వారు ఏం చేసిన గొప్పగా ప్రచారం చేస్తారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్ బేస్ అతని వారసులుగా వచ్చిన నటులకి కూడా దొరికింది. అయితే మెగాస్టార్ ఇమేజ్ బౌండరీ నుంచి దాటొచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బన్నీ ఆర్మీ అంటూ ఫ్యాన్స్ బేస్ ని బిల్డ్ చేసుకున్నారు. బయటివారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, డార్లింగ్ ప్రభాస్ లు, జూనియర్ ఎన్టీఆర్ లు ఇండియాలోనే అత్యధిక ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ గా ఉన్నారు.

అయితే సినిమా హీరోలు లక్షల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవడంలోనే కాకుండా యాక్టర్ గా అవార్డ్స్ సొంతం చేసుకోవడం కూడా గొప్ప గౌరవంగా భావిస్తారు. తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న నటుడుగా అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే మేడమ్ టుస్సాడ్ మ్యూజియంకి ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఆ మ్యూజియంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల మైనపు విగ్రహాలు పెడతారు. తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ మైనపు విగ్రహాలు ఆ మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహం కూడా దుబాయ్ లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు. అలాగే స్టార్ హీరోలలో గౌరవ డాక్టరేట్ లు తీసుకునేది చాలా తక్కువ మంది.

మొదటి సారి రామ్ చరణ్ కి తమిళనాడులో వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. ఇలా యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ లు అందుకోవడం స్టార్ హీరోలకి లభించే ప్రత్యేక గౌరవం అని చెప్పాలి. ఇలాంటి గౌరవాన్ని పొందడానికి ప్రతి హీరో ఆశపడతారు. అయితే సుదీర్ఘంగా ఏదో ఒక రంగంలో సేవలు చేసేవారికి ఈ డాక్టరేట్ లు లభిస్తాయి. మొదటి సారి స్టార్ గా రామ్ చరణ్ కి దక్కింది. నెక్స్ట్ ఈ జాబితాలోకి ఎవరొస్తారో చూడాలి.