Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్.. మన స్టార్స్ ప్లాన్స్ ఏమిటంటే..

స్టార్స్ అయితే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో అయితే సెలబ్రిటీ ఇమేజ్ కారణంగా బయట నార్మల్ గా తిరగలేరు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:04 AM GMT
న్యూ ఇయర్.. మన స్టార్స్ ప్లాన్స్ ఏమిటంటే..
X

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ వేడుకలతో హడావుడి చేయడం మామూలుగా ఇండదు. స్టార్స్ అయితే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో అయితే సెలబ్రిటీ ఇమేజ్ కారణంగా బయట నార్మల్ గా తిరగలేరు.

అందుకే విదేశాలకి చెక్కేసి ఎంచక్కా సామాన్యుల మాదిరిగా తిరిగేస్తూ హ్యాపీగా ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఓ వైపు హైదరాబాద్ లో హోటల్స్ అన్ని న్యూ ఇయర్ పార్టీలకి రెడీ అయిపోయాయి. ఇక్కడి ప్రజలు కూడా ఈ పార్టీల కోసం సన్నద్ధం అయిపోతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాలకి చెక్కేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్ళిపోయాడు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి మొదటి వారంలో మరల ఇండియా తిరిగి వస్తారంట. సెకండ్ వీక్ లో దేవర మూవీ షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అవుతారని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్తున్నారు.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ న్యూయార్క్ లో చదువుతున్నాడు. ఈ కారణంగానే ఫ్యామిలీ అందరూ అక్కడికి వెళ్లి న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నమ్రత, సితార న్యూయార్క్ వెళ్ళిపోయారు. మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ ముగించుకొని వెళ్లనున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ ఈ వీకెండ్ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఆశ్వాదించబోతున్నారు.

అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ కోసం యూఎస్ లో ఉన్నారు. అతను కూడా కొత్త సంవత్సర వేడుకలకి యూఎస్ లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అలాగే రష్మిక మందన తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో న్యూస్ ఇయర్ వేడుకలకి రెడీ అవుతోంది. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కొత్త సంవత్సర వేడుకలు చేసుకోబోతోంది. ఇతర సెలబ్రిటీ స్టార్స్ కూడా వేడుకలని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.