Begin typing your search above and press return to search.

ఓటీటీ డీల్స్.. ఆశపడి దెబ్బతిన్న స్టార్ హీరో సినిమా

ఆశకు హద్దు ఉండాలి, ఆలోచనకు అంతుండాలి.. అత్యాశ ఎప్పటికీ మంచిది కాదు.. ఇవన్నీ మనకు మన పెద్దలు చెప్పిన మాటలు

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:29 AM GMT
ఓటీటీ డీల్స్.. ఆశపడి దెబ్బతిన్న స్టార్ హీరో సినిమా
X

ఇప్పుడు ఇదే పరిస్థితి ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా విషయంలో జరిగింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ప్రమోషన్స్ కూడా బాగానే నిర్వహించింది చిత్ర యూనిట్. ఎక్కడా స్టోరీ లైన్ బయటపెట్టకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది. అప్పటికే వరుస ఫ్లాపులతో తన మార్కెట్ వాల్యూ తగ్గడంతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు ఆ హీరో.

కానీ ఇటీవలే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది. మొదట్లో వసూళ్లు బాగానే వచ్చినా.. తర్వాత తేలిపోయింది. మేకర్స్ కు నష్టాలు మిగిల్చింది. ఈ మూవీ ఎఫెక్ట్ తో ఆ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పడిందని టాక్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఆ మూవీ తీయాల్సి ఉన్నా ఇప్పుడు సైలెంట్ గా ఊరుకుందట. అంతకుముందు కూడా ఈ హీరో విషయంలో అదే జరిగిందట.

అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ కూడా అత్యాశ చూపించారట. విడుదలకు ముందే మంచి రేట్ కు డీల్స్ కుదుర్చుకునేందుకు మేకర్స్ ను చాలా మంది సంప్రదించారట. కానీ మేకర్స్ మాత్రం ఎక్కువ ఆశపడి వెనకడుగు వేశారట. థియేట్రికల్ రైట్స్ ను కూడా భారీ ధరకు అమ్మలేదట.

అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు అన్ని సినిమాల ఓటీటీ రైట్స్ ను థియేటర్ లో రిలీజ్ కు ముందే అమ్మేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీ.. ఓటీటీ రైట్స్ డీల్ ఇప్పుడు కుదిరింది. ఎప్పుడో సెట్ అవ్వాల్సిన డీల్ ను మేకర్స్ ఇప్పుడు చేసుకున్నారు. అది కూడా మూవీ రిలీజ్ అయ్యాక నష్టాలు వచ్చిన తర్వాత డీల్ సెట్ చేసుకున్నారు. మొదట వచ్చిన ఆఫర్స్ కంటే, చాలా తక్కువ రేటుకు అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. అతిగా ఆశపడితే ఇంతేనేమో మరి.