Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మ‌రో రెండు ప్ర‌యోగాల‌కు రెడీనా!

శంక‌ర్..మ‌ణిర‌త్నం లాంటి గ్రేట్ ఇండియ‌న్ మేక‌ర్స్ తో ఎన్నో ప్ర‌యోగాలు చేసాడు గానీ ఫ‌లించ‌లేదు.

By:  Tupaki Desk   |   26 March 2024 12:30 AM GMT
స్టార్ హీరో మ‌రో రెండు ప్ర‌యోగాల‌కు రెడీనా!
X

చియాన్ విక్ర‌మ్ కి స‌రైన సోలో స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' పాన్ ఇండియాలో మంచి విజ‌యం సాధించిన ఆ క్రెడిట్ చాలా మంది న‌టుల‌కు ద‌క్కుతోంది. అందులో విక్ర‌మ్ కేవ‌లం పాత్ర ధారుడు మాత్ర‌మే. 'ఇరు ముగ‌న్' సినిమా త‌మిళ్ లో బాగా ఆడినా తెలుగు లో 'ఇంకొక్క‌డు'గా రిలీజ్ అయినా ఇక్క‌డ పెద్దగా ప్ర‌భావం చూప‌లేదు. ఇంకా చెప్పాలంటే 'అప‌రిచుతుడు' త‌ర్వాత విక్ర‌మ్ రేంజ్ హిట్ ఏ సినిమా ఇవ్వ‌లేద‌నే చెప్పాలి.


శంక‌ర్..మ‌ణిర‌త్నం లాంటి గ్రేట్ ఇండియ‌న్ మేక‌ర్స్ తో ఎన్నో ప్ర‌యోగాలు చేసాడు గానీ ఫ‌లించ‌లేదు. దీంతో చాలా కాలంగా విక్ర‌మ్ హిట్ రేసులో బాగా వెనుక‌బ‌డే ఉన్నట్లే క‌నిపిస్తుంది. గ‌త ఏడాది కేవ‌లం 'పొన్నియ‌న్ సెల్వ‌న్ -2' తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. ఇంకెలాంటి సినిమాల‌కు క‌మిట్ అవ్వలేదు. రిలీజ్ కాలేదు. దీంతో విక్ర‌మ్ కి అవ‌కాశాలు త‌గ్గాయా ? లేక స‌రైన క‌థ‌లు దొర‌క్క‌పోవ‌డంతో వెయిట్ చేస్తున్నాడా? అని రక‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

దీంతో చియాన్ 2024 లో అలెర్ట్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. ఈసారి సినిమాల ప‌రంగా వేగం పెంచుతున్న‌ట్లు తెలుస్తుంది. 'తంగ‌లాన్' ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది కూడా మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం. పా రంజిత్ తెర‌కెక్కించిన సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన విక్ర‌మ్ లుక్....పాత్ర ప్ర‌తీది అంచనాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. విక్ర‌మ్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఈ సినిమా ఉంటుంద‌ని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఆగ‌స్టులో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన పెండింగ్ ప్రాజెక్ట్ 'ధృవ న‌క్ష‌త్రం' కూడా రిలీజ్ కి సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ తేది ప్ర‌క‌టించి వాయిదా వేసారు. దీంతో వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు గాక విక్ర‌మ్ మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు స‌మాచారం. అందులో ఒక‌టి శంక‌ర్ తో ఉంటుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రో సినిమా కంగువ ద‌ర్శ‌కుడు శివ‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు వినిపిస్తోంది. ఈ రెండు క‌మిట్ మెంట్ల‌తో విక్ర‌మ్ మ‌ళ్లీ స్పీడ‌ప్ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.