Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్లు దిగొచ్చిన వేళ‌!

హీరోతో ప‌నిలేకుండా ప‌క్క‌న ఎలాంటి స్టార్ డ‌మ్ లేని హీరో అయినా ఒకే అని ముందుకెళ్లిపోతున్నారు.

By:  Tupaki Desk   |   21 March 2024 4:30 PM GMT
స్టార్ హీరోయిన్లు దిగొచ్చిన వేళ‌!
X

కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేద‌ని దర్శ‌కులు న‌మ్మి సినిమాలు చేస్తోన్న త‌రుణం ఇది. ఇప్పుడీ మాట‌ని స్టార్ హీరోయిన్లు కూడా అంతే బ‌లంగా న‌మ్ముతున్నట్లు క‌నిపిస్తుంది. కంటెంట్ ఉంటే స్టార్ హీరో ఎందుకు మ‌న‌మే ఓ కంటెంట్ అంటూ మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌రైన క‌థ కుదిరితే లేడీ ఓరియేంటెడ్ నాయిక‌లుగా చేయ‌డానికి ఏమాత్రం వెన‌క‌గ‌డుగు వేయ‌డం లేదు. హీరోతో ప‌నిలేకుండా ప‌క్క‌న ఎలాంటి స్టార్ డ‌మ్ లేని హీరో అయినా ఒకే అని ముందుకెళ్లిపోతున్నారు.


తాజాగా న‌టుడు సుహాస్ స‌ర‌స‌న న‌టించ‌డానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. కీర్తి మెయిన్ లీడ్ లో ఐవీ శ‌శి `ఉప్ప‌క‌ప్పురంబు` అనే ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ స‌ర‌స‌న సుహాస్ న‌టిస్తున్నాడు. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన కీర్తి ఇప్పుడు సుహాస్ కి జోడీగా న‌టించ‌డం ఏంటి? అంటే కంటెంట్ అలా డిమాండ్ చేస్తుంద‌ని తెలుస్తుంది. గ‌తంలో స‌మంత కూడా దేవ్ మోహ‌న్ తో ఓ సినిమా చేసింది.

`శాకుంత‌లం` సినిమాలో అమ్మ‌డు దేవ్ మోహ‌న్ తో రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. స‌మంత మెయిన్ లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ప్ర‌స్తుతం ఇదే న‌టుడితో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కూడా న‌టిస్తోంది. ఈ అమ్మ‌డు మెయిన్ లీడ్ లో `రెయిన్ బో` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో దేవ్ మోహ‌న్ అమెకి పెయిర్ గా న‌టిస్తున్నాడు. అలాగే న‌వీన్ పొలిశెట్టితో స్వీటీ అనుష్క కూడా మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే క్రిష్ తెర‌కెక్కిస్తోన్న `ఘాటి`లో మ‌రోసారి అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తుంది. ఒరిస్సాలో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో విక్ర‌మ్ ప్ర‌భు ...అనుష్క‌కి జోడీగా న‌టిస్తున్నాడు. క‌థ అంతా అనుష్క చుట్టూ తిరిగినా ఆమెకి స‌పోర్టింగ్ రోల్ లో విక్ర‌మ్ న‌టిస్తు న్నాడు. ఆ ర‌కంగా స్టార్ హీరోయిన్లు అంతా యంగ్ హీరోల‌కి ఫెయిర్ గా మారుతున్నారు. ఇంత‌కు మందు నిత్యామీన‌న్ `ఘ‌ట‌న` అనే ఓ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. అందులో ఆమె ఏకంగా అత్యాచార బాధితురాలి పాత్ర‌లో న‌టించింది. అత్యాచారం చేసే పాత్ర‌లో సీనియ‌ర్ వి.కె న‌రేష్ న‌టించాడు. ఆ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.