Begin typing your search above and press return to search.

సీనియర్ల‌తో కొత్త భామ‌ల‌కు క‌ష్టంగానే ఉందా?

దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త భామ‌ల‌కంటే సీనియ‌ర్లే బెట‌ర్ అనే ఆప్ష‌న్ కి వెళ్తున్నారు. త్రిష‌..త‌మ‌న్నా..అనుష్క‌...కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి భామ‌లు అందుకే మ‌ళ్లీ బిజీ అవ్వ‌గ‌లుగుతున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 5:30 PM GMT
సీనియర్ల‌తో కొత్త భామ‌ల‌కు క‌ష్టంగానే ఉందా?
X

సీనియ‌ర్ భామ‌ల‌కు మ‌ళ్లీ టైమోచ్చింది. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన భామ‌లు మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తున్నారు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త భామ‌ల‌కంటే సీనియ‌ర్లే బెట‌ర్ అనే ఆప్ష‌న్ కి వెళ్తున్నారు. త్రిష‌..త‌మ‌న్నా..అనుష్క‌...కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి భామ‌లు అందుకే మ‌ళ్లీ బిజీ అవ్వ‌గ‌లుగుతున్నారు. కొన్ని నెలల క్రితం తమన్నాకు పెద్ద‌గా ఆఫర్లు లేవు. దీంతో అమ్మ‌డు కెరీర్ చ‌ర‌మాంకానికి చేరిన‌ట్లేన‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడామె ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు.

గ్లామర్ హీట్ పెంచ‌డంతో అమ్మ‌డి డేట్లు కోసం మ‌ళ్లీ క్యూ క‌ట్ట‌డం మొద‌లైంది. ప్ర‌స్తుతం తెలుగు..త‌మిళ్..హిందీ మూడు భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. పైగా నిర్మాతలు భారీ పారితోషికం చెల్లించి మ‌రీ తీసుకుంటున్నారు. ఇక త‌మ‌న్నా కంటే సీనియర్ అయిన త్రిష స్పీడ్ అయితే జెట్ తోనే పోల్చాలి. సినిమా ఛాన్సుల‌తో పాటు ప‌దికోట్ల‌కు పైగానే పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 'థ‌గ్ లైఫ్' సినిమా కోసం క‌మ‌ల్ కి జోడీగా న‌టించేందుకు అక్ష‌రాలా 12 కోట్లు తీసుకుంది. 'విశ్వంభ‌ర‌'లో చిరంజీవి స‌ర‌స‌న న‌టించ‌డానికి దాదాపు అందుకు స‌మానంగా ఛార్జ్ చేస్తోంది.

ఇంకా కోలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. స్వీటీ అనుష్క కూడా మ‌ళ్లీ స్పీడ‌ప్ అవుతోంది. స్వీటీ ప‌నైపోయింద‌న్న వాళ్లే ఇప్పుడు మ‌ళ్లీ పుంజుకుంటుంది అంటున్నారు. ప్ర‌స్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓలేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తోంది. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది మ‌ల‌యాళంలోనూ ఎంట్రీ ఇస్తుంది. ఇవిగాక మ‌రో రెండు సినిమాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా మునుప‌టి కంటే వేగంగానే సినిమాలు చేస్తోంది.

ప్ర‌స్తుతం మూడు-నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇందులో ఇండియ‌న్- 2 కూడా ఉంది. ఈ సినిమా గ‌నుక విజ‌యం సాధిస్తే అమ్మ‌డికి పాన్ ఇండియాలో వెలిగిపోతుంది. ప్ర‌స్తుతం హిందీలో సినిమాలు చేస్తున్నా! చిన్నా చిత‌కా సినిమాల‌వ‌న్నీ. సరైన ఛాన్స్ రావ‌డం లేదు. ఇక లేడీ సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతున్న న‌య‌న‌తార గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ న‌చ్చితే త‌ప్ప సినిమా చేయ‌డం లేదు. మార్కెట్ లో డిమాండ్ ఆమెకి ఆ రేంజ్ లో ఉంది. జ్యోతిక కూడా న‌టిగా బిజీ అవుతున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే న‌టిగానే సోలోగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీళ్లంతా బిజీ అవ్వ‌డంతో కొత్త భామ‌ల‌కు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి.