Begin typing your search above and press return to search.

సింగం ప్రాంచైజీ వ‌రల్డ్ లోకి ఆ స్టార్ హీరో!

ఈ నేప‌థ్యంలో తాజాగా సింగం ప్ర‌పంచంలోకి అర్జున్ క‌పూర్ కూడా అడుగు పెడుతున్నాడు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 3:30 PM GMT
సింగం ప్రాంచైజీ వ‌రల్డ్ లోకి ఆ స్టార్ హీరో!
X

బాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ 'సింగం' ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అజయ్ దేవ‌గ‌ణ్ క‌థానాయ‌కుడిగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ప్రాంచైజీకి హిందీ మార్కెట్ లో అసాధార‌ణ‌మైన క్రేజ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో షేక్ చేసాయి. కాప్ యూనివ‌ర్శ‌ల్ భాగంగా మ‌ళ్లీ 'సింగం ఎగైన్' అంటూ మ‌ళ్లీ ఈ ద్వ‌యం రంగం సిద్దం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది ముగింపులో 'సింగం ఎగైన్' సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ నేప‌థ్యంలో సినిమా గురించి లీక్ అయ్యే ఒక్కో అప్ డేట్ అంత‌కంత‌కు ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నాయి. 'సింగం ఎగైన్' లో ఈ సారి తెరంతా రంగుల మ‌యం కానుంది. ఇప్ప‌టికే అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న క‌త్రినాకైఫ్ ఎంపికైంది. దీపికా ప‌దుకొణే ని ఓ కీల‌క పాత్రకి సంబంధించి ఇప్ప‌టికే ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేసారు. ఇంత పెద్ద హీరోయిన్ తీసుకొచ్చా రంటే? సినిమాలో ఆమె పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌న్న‌ది గెస్ చేయోచ్చు.

ఆమె ఎంట్రీతోనే సింగంకి అద‌న‌పు హంగులు యాడ్ అయ్యాయి. అలాగే ర‌ణ‌వీర్ సింగ్.. కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వీరిద్ద‌రు రియ‌ల్ లైఫ్ లో భార్యాభ‌ర్త‌లు. అలాంటి రిలేష‌న్ షిప్ సినిమాలో ఏదైనా ఉంటుందా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సింగం ప్ర‌పంచంలోకి అర్జున్ క‌పూర్ కూడా అడుగు పెడుతున్నాడు. ఏకంగా విల‌న్ బాధ్య‌త‌లు అర్జున్ క‌పూర్ కే అప్ప‌గించారు. పోలీసుల్ని ఎదురించే బ‌ల‌మైన విల‌న్ పాత్ర‌కి ఆయ‌న్నే తీసుకున్నారు.

హీరోకి ధీటుగా సాగే పాత్ర‌కి రోహిత్ శెట్టి ఎవ‌ర్నీ ఎంపిక చేస్తారు? అన్న దానికి చివ‌రికి అర్జున్ క‌పూర్ ఎంట్రీతో తెర‌ప‌డింది. ఆర‌కంగా తెర‌పై అక్ష‌య్ కుమార్ ని క‌పూర్ బోయ్ ఢీ కొట్ట‌బోతున్నాడు. అలాగే సినిమాలో క‌రీనా క‌పూర్ కూడా సినిమాలో భాగ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రో కీల‌క మైన పాత్ర‌లో ఆమెని దించాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడుట‌. మొత్తానికి 'సింగం ఎగైన్' ప్రారంభానికి ముందే మీడియాలో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తోంది.