Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్ కొడుకును దాచేయ‌డానికి కార‌ణం?

ప‌రిశ్ర‌మ‌లో స్టార్‌క‌పుల్ గా పాపుల‌రైన జంట ఇటీవ‌లే విడాకులు తీసుకున్నారు. ఈ జంట త‌మ కుమారుడిని మీడియా గ్లేర్ కి దూరంగా ఉంచారు. దానికి కార‌ణ‌మేమిటో ఇప్పుడు సీక్రెట్ బ‌య‌ట‌కు తెలిసింంది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 10:30 AM GMT
స్టార్ క‌పుల్ కొడుకును దాచేయ‌డానికి కార‌ణం?
X

ప‌రిశ్ర‌మ‌లో స్టార్‌క‌పుల్ గా పాపుల‌రైన జంట ఇటీవ‌లే విడాకులు తీసుకున్నారు. ఈ జంట త‌మ కుమారుడిని మీడియా గ్లేర్ కి దూరంగా ఉంచారు. దానికి కార‌ణ‌మేమిటో ఇప్పుడు సీక్రెట్ బ‌య‌ట‌కు తెలిసింంది.

ఇదంతా అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట గురించే. ఈ ఇద్ద‌రూ 2021లో విడిపోయారు. కుమారుడు ఆజాద్‌కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. కిర‌ణ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లాపాటా లేడీస్ విడుద‌ల‌కు సిద్ధం కాగా, ఇటీవలి ఇంటర్వ్యూలో కిర‌ణ్ రావు మాట్లాడుతూ.. తన‌ కొడుకును ప్రజల దృష్టికి దూరంగా ఉంచ‌డానికి కార‌ణ‌మేమిటో మాట్లాడాడు.

అమీర్ ఖాన్ అతని మాజీ భార్య కిరణ్ రావు విడాకులు తీసుకున్నప్పటికీ స్వచ్ఛమైన బంధాన్ని, స్నేహాన్ని రీడిఫైన్ చేస్తున్నారు. ఈ జంట 2005లో వివాహం చేసుకున్నారు. జూలై 2021లో విడిపోతున్నారని ప్రకటించారు. అయినప్పటికీ వారు తమ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఆజాద్ రావ్ డిసెంబర్ 2011న జ‌న్మించాడు. చిత్ర పరిశ్రమలోని అత్యంత పాపుల‌ర్ జంట అయినా కానీ, అమీర్ - కిరణ్ వారి కుమారుడు ఆజాద్‌ను ప్రజాదృష్టికి దూరంగా ఉంచారు. అతడు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కనిపిస్తాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిర‌ణ్ రావు ఇదే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో పిల్లలకు గోప్యత ఉండాలని కిర‌ణ్ రావు నొక్కి చెప్పారు. ``పిల్లలకు గోప్యత ఉండాలని నేను భావిస్తున్నాను. బహిరంగంగా రావడానికి ఆసక్తి ఉన్న పిల్లలు ఖచ్చితంగా అలా చేస్తారు. కానీ ఆజాద్ నిజంగా ఈ పెద్ద ఈవెంట్‌లపై ఆసక్తి చూపలేదు. కాబట్టి మేము అతని గోప్యతను కాపాడుతున్నాం. అమీర్, నేను మనుషులుగా చాలా సామాన్యులం. మేము బయట పార్టీలు లేదా ఈవెంట్‌లకు వెళ్లే గ్లామరస్ వ్యక్తులం కాదు. మేము ఎక్క‌డికీ వెళ్లడం లేదు కాబట్టి ఆజాద్ రావ్ రెడ్ కార్పెట్ కోసం బయటికి వ‌స్తాడ‌నుకోలేం``అని కిర‌ణ్ రావు చెప్పారు. యువ‌కుడు అంత ఆసక్తిని కలిగి లేడు.. నేను అతనిని తీసుకుని వెళ్లాల‌ని ఆసక్తిగా లేను. పిల్లలు వారి స్వంత ఆసక్తికి త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రించాల‌ని నేను భావిస్తున్నాను.


కొడుకు ఆజాద్ సినిమాల వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదో కూడా కిరణ్ రావు వివరించారు. ఆజాద్ యానిమేషన్ రంగం వైపు మొగ్గు చూపుతున్నాడ‌ని తెలిపారు. సున్నిత మనస్కుడైన సానుభూతిప‌రుడైన‌ కొడుకు.. సినిమా చూసేప్పుడు కూడా చాలా భావోద్వేగానికి గుర‌వుతాడ‌ని తెలిపారు. ఇతర పిల్లలు చాలా సాధారణమైనవిగా భావించే విషయాలకు కూడా ఆజాద్ ఎక్కువ‌ ప్రభావితమవుతాడని ఆమె గుర్తుచేసుకుంది. 12 ఏళ్ల పిల్లవాడైన ఆజాద్ థియేట‌ర్ లో ఒక సీన్ చూసి `పైలట్‌కి ఏమైంది?`` అని అడిగాడు.. తన కొడుకుతో TIE ఫైటర్ విమానం క్రాష్ అవుతోంద‌ని చెప్పాల్సి వ‌చ్చింద‌ట‌.

ప్రారంభంలో ఆజాద్ లైవ్-యాక్షన్ చూడలేక‌పోయేవాడు. అతడు యానిమేషన్ చూడగలడు.. కానీ లైవ్ యాక్షన్ చూడ‌లేడు. ఇప్పుడు అతనికి 12 ఏళ్లు... పిల్ల‌వాడు ఇక‌పై అన్ని అంశాలను చూడటానికి సిద్ధంగా ఉన్నాడని నేను క‌చ్చితంగా అనుకుంటున్నాను`` అని అన్నారు.

విడాకుల తర్వాత అమీర్ ఖాన్ కిరణ్ రావుతో కలిసి పనిచేస్తున్నారు.. కిర‌ణ్ తో గొప్ప అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. విడాకులు తీసుకుంటే శత్రువులుగా మారాల‌ని సలహా ఇవ్వలేదని ఇంత‌కుముందు అమీర్ ఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. కిర‌ణ్ రావు తన జీవితంలోకి రావడం.. వారి ప్రయాణం సఫలీకృతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఆయన తెలిపారు.

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మానవతావాద భావోద్వేగ స్థాయిలలో ఎల్లప్పుడూ కనెక్ట్ అవుతామ‌ని, మేం ఒక కుటుంబం లా క‌లిసి ఉంటామ‌ని తెలిపారు. ఒకరితో ఒకరు కలిసి పని చేయడం ఆనందిస్తామ‌ని కిర‌ణ్ రావు పేర్కొన్నారు. దానికి అమీర్ కూడా స్పందిస్తూ.. తనని కిర‌ణ్ అప్పుడప్పుడు తిడుతుందని, అది సరదాగా ఉంటుందని చమత్కరించాడు.