Begin typing your search above and press return to search.

స్టార్‌ కమెడియన్‌ కన్నుమూత

నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ మెప్పించిన రిచర్డ్‌ పలు ఫిక్షన్‌ కథాంశాల్లో నటించి మెప్పించాడు

By:  Tupaki Desk   |   29 Feb 2024 7:39 AM GMT
స్టార్‌ కమెడియన్‌ కన్నుమూత
X

అమెరికన్ స్టార్‌ స్టాండ్ అప్ కమెడియన్‌ రిచర్డ్‌ ఫిలిప్ లూయిస్‌ తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు దక్కించుకుని ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న రిచర్డ్‌ మృతికి ఆయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ మెప్పించిన రిచర్డ్‌ పలు ఫిక్షన్‌ కథాంశాల్లో నటించి మెప్పించాడు. తన విభిన్నమైన కామెడీ తో రిచర్డ్‌ అలరించాడు. 1970 నుంచి 1980 మధ్య లూయిస్ స్టాండప్‌ కమెడియన్‌ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

హాలీవుడ్‌ లో రిచర్డ్‌ ఫిలిప్ నటనకు గాను ఎన్నో అవార్డులు మరియు రివార్డులు దక్కాయి. లాస్‌ ఏంజిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో రిచర్డ్‌ మృతి చెందినట్లుగా ఆయన భార్య దృవీకరించారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

రిచర్డ్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరియు ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవను గుర్తు చేసుకుంటూ అభిమానులు నివాళ్లు అర్పిస్తున్నారు. గొప్ప కమెడియన్ ని కోల్పోయాం అంటూ ఎంతో మంది సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.