నటవారసులు చేతులెత్తేసారు!
బాలీవుడ్ లో నటవారసుల వెల్లువ ఆగడం లేదు! ఇంతకుముందు ఖుషి కపూర్, సుహానా ఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సహా పలువురు నెపో కిడ్స్ వెండితెరకు పరిచయమయ్యారు.
By: Tupaki Desk | 30 Jun 2025 10:00 AM ISTబాలీవుడ్ లో నటవారసుల వెల్లువ ఆగడం లేదు! ఇంతకుముందు ఖుషి కపూర్, సుహానా ఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సహా పలువురు నెపో కిడ్స్ వెండితెరకు పరిచయమయ్యారు. కానీ వీళ్లలో ఎవరికీ సరైన స్పార్క్ లేదనే విమర్శలొచ్చాయి. వీరంతా ఆరంగేట్రం ఆశించిన మేరకు రాణించలేకపోయారు. అంతేకాదు.. ఒకప్పటి నటవారసులతో పోలిస్తే నేటితరం హ్యాబిట్స్ కానీ, ఎంపిక చేసుకున్న రంగంపై ఫ్యాషన్ కానీ చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటి తారలు కేవలం మార్షల్ ఆర్ట్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ పై దృష్టి సారిస్తున్నారు. కానీ ఒకప్పటి పిల్లలు అలా కాదు. వారు నటులుగా సహజసిద్ధమైన ప్రదర్శనతో వచ్చారు. పైగా స్టేజీ డ్రామా వంటి వాటిని వారు ఎంచుకున్నారు. కానీ ఇప్పటి పిల్లల్లో అలాంటివేవీ కనిపించడం లేదనే విమర్శ ఉంది.
బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు సైయారా, ఆంఖోన్ కి గుస్తాఖియాన్ త్వరలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇవి ముగ్గురు నటవారసులను పరిచయం చేయబోతున్నాయి. సైయారా చిత్రంతో అహాన్ పాండే , అనీత్ పద్దాల ఆరంగేట్రం చేస్తున్నారు. ఆంఖోన్ కి గుస్తాఖియాన్ చిత్రంతో నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానయా కపూర్ వెండితెరకు పరిచయం అవుతోంది.
విమర్శల నేపథ్యంలో కనీసం వీరంతా జాన్వీ, సారా అలీఖాన్ తరహాలో హార్డ్ వర్క్ తో ఆడియెన్ కి కొంతైనా కనెక్ట్ అవుతారేమో చూడాలి. మొదటి సినిమాతో ఆదరణ దక్కకపోయినా కనీసం నాలుగైదు సినిమాలతో అయినా నిరూపించాల్సి ఉంటుంది. ఒకప్పటి నటవారసుల్లా స్వయం కృషితో ఎదగాలనే కండీషన్లు వీళ్లకు లేవు. ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉంది. సిల్వర్ స్పూన్ తో పుట్టారు. అయితే గర్వం నెత్తికెక్కకుండా, బాగా శ్రమిస్తేనే పరిశ్రమలో రాణించగలమనే స్పృహ వీరికి ఉండాలి.
