Begin typing your search above and press return to search.

హీరోయిన్ తల్లి.. కూతురు కెరీర్ విషయంలో అలా చేస్తుందా?

హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందంతోపాటు అదృష్టం కూడా ముఖ్యమనే చెప్పాలి. టాలెంట్ ఫుల్ గా ఉన్నా లక్ కూడా ఉండాల్సిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2025 5:00 AM IST
హీరోయిన్ తల్లి.. కూతురు కెరీర్ విషయంలో అలా చేస్తుందా?
X

హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందంతోపాటు అదృష్టం కూడా ముఖ్యమనే చెప్పాలి. టాలెంట్ ఫుల్ గా ఉన్నా లక్ కూడా ఉండాల్సిందే. అప్పుడే సక్సెస్ అవుతుంటారు. అదే సమయంలో హీరోయిన్స్ కు సపోర్ట్ గా వాళ్ల పేరెంట్స్ ఎప్పుడూ ఉంటారు. తమ డాటర్స్.. హీరోయిన్ గా క్లిక్ అయ్యేందుకు అనేక మంది హెల్ప్ చేస్తుంటారు.

సదరు బ్యూటీలు.. క్లిక్ అయ్యాక.. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాక.. డేట్స్ లేదా ఆర్థిక నిర్వహణలో కుమార్తెలకు సహాయం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ తల్లి మాత్రం అన్నీ ఆమెనే చూసుకుంటున్నారు. డేట్స్ మేనేజ్ చేయడం, ఫైనాన్స్ చూసుకోవడం, స్క్రిప్ట్‌ లు విని ప్రాజెక్టులకు ఆమోదం చెప్పడం సహా అన్నీ ఆమెనే.

కానీ అదే ఇప్పుడు హీరోయిన్ కు బ్యాక్ ఎండ్ గా మారిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తల్లి స్వయంగా తన కుమార్తె గోల్డెన్ కెరీర్‌ ను నాశనం చేస్తోందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రియాలిటీ చెక్ చేసుకోకపోతే, సదరు హీరోయిన్ నష్టపోతుందని చెబుతున్నారు. హీరోయిన్ గా మళ్లీ మనుగడ సాధించడం కష్టమని అంటున్నారు.

అయితే కొన్నేళ్ల క్రితం సదరు హీరోయిన్ తెలుగులోకి రాగా, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తున్నా.. అనుకున్నట్లు జరగడం లేదు. ఒకేసారి 5-6 సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. షూటింగ్స్ కు వెళ్తూ క్షణం తీరిక లేకుండా ఉంది. మధ్య తన చదువు కూడా కంప్లీట్ చేస్తోంది.

ఇంతలో బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తోంది అమ్మడు. పలు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. కానీ తెలుగు సినిమాలను ఎక్కువగా సైన్ చేయడం లేదు. కేవలం బీ టౌన్ లో సినిమాలు చేయాలని ఆమె తల్లి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ఇప్పుడు ప్రచారం సాగుతోంది.

ఇప్పుడు ఏకంగా తన తల్లి తీసుకున్న నిర్ణయం వల్ల.. ఓ బడా హీరో లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా నుంచి ఏకంగా తప్పుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అలా జరిగినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నా.. తల్లి తప్పుడు నిర్ణయం ఆమె మార్కెట్ ను దెబ్బతీస్తుంది! కాబట్టి సదరు హీరోయిన్ .. ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకోవాలని అంతా సూచిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.