ఏడాదికి ఒక్క సినిమాతో వచ్చే ఒకే ఒక్కడు!
నటుడిగా నాని కెరీర్ మొదలై 16-17 సంవత్సరాలవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడాదికి ఒక్క సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు.
By: Tupaki Desk | 8 Jun 2025 8:00 PM ISTస్టార్ హీరోలంతా ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయాలన్నది నిర్మాతల డిమాండ్. అలా రిలీజ్ చేయకపోతే జనాలు పూర్తిగా థియేటర్లకు రావడం మానేస్తారని...అదే జరిగితే థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఈ విషయంలో తాము చేయాల్సిందల్లా చేస్తున్నామని...హీరోలు ముందుకు రాకపోతే గనుక ఇక తాము కూడా చేసేదేముండనది హెచ్చరించారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది హీరోలు మాత్రమే. స్టార్ హీరోల సినిమాల వరుస ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు.
రెండేళ్లకు ఒక్క సినిమా చొప్పున రిలీజ్ చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా సీనియర్లనే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోన్న తరుణంలో ఇకపై స్టార్ హీరో సినిమా రెండున్నరేళ్ల తర్వాత రిలీజ్ అవు తుంది? అన్నది కనిపిస్తుంది. టైర్ 2 హీరోలు....ఆ తర్వాత సెక్షన్ హీరోలు సరైన కథలు దొరక లేదంటా కాలం వెళ్లదిస్తున్నారు. మరి వీళ్లందరిలో ఏడాది ఒక్క సినిమా రిలీజ్ కు కట్టుబడి ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే నేచురల్ స్టార్ నాని ఒక్కడే కనిపిస్తున్నాడు.
నటుడిగా నాని కెరీర్ మొదలై 16-17 సంవత్సరాలవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడాదికి ఒక్క సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో 2013లోనే ఆయన నటించిన ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. మిగతా అన్ని సంవత్సరాలు కూడా ఓ అర్డర్ ప్రకారం సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ సినిమా హిట్ అయిందా? ప్లాప్ అయిందా? అన్నది పక్కన బెడితే ఓ ప్రణాళిక ప్రకారం సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసాడు.
వీటిలో చాలా సినిమాలు సక్సస్ అయినవే. అలా కాకపోతే ఈరోజు నాని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఆ రకంగా నానిని చూసి మిగతా స్టార్ హీరోలంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సంవత్సరల తరపడి ఒకే సినిమాకు సమయాన్ని కేటాయించే హీరోలంతా నాని అడిగి కొన్ని టిప్స్ తీసుకోవాలి. అలాగే దర్శకులు కూడా షూటింగ్ ను సంవత్సరాల తరబడి సాగదీయాల్సిన అవసరం లేదు. వీలైనంత వేగంగా పూర్తి చేసి కంటెంట్ ఇచ్చేలా నిర్మాత దర్శకుడిపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే స్టార్ హీరోలంతా ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయగలరు.
