పువ్వు...నవ్వు కోసం పేరు మార్చుకున్న స్టార్!
స్టార్ హీరోల స్క్రీన్ నేమ్...వాస్తవ పేరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. స్క్రీన్ నేమ్స్ అన్నవి చిత్ర పరిశ్రమ సక్సస్ లు ఆధారంగా ఇస్తుంటుంది.
By: Tupaki Desk | 20 May 2025 12:15 AM ISTస్టార్ హీరోల స్క్రీన్ నేమ్...వాస్తవ పేరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. స్క్రీన్ నేమ్స్ అన్నవి చిత్ర పరిశ్రమ సక్సస్ లు ఆధారంగా ఇస్తుంటుంది. సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డు లు, ప్రేక్షకుల ఆధరణ ఇలా కొన్ని అంశాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. చిరంజీవి శివ శంకర వర ప్రసాద్ అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మడం కష్టం. ఆయన ఒరిజినల్ అదైనా? అంతా చిరంజీవినే పిలు స్తుం టారు.
అంతెందుకు ఆయన వాస్తవ పేరు ఇంట్లో కుటుంబ సబ్యులకు కూడా పూర్తి అవగాహన ఉండక పొచ్చు. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది యండమూరి వీరేంద్రనాద్. చిరంజీవి సక్సస్ లు చూసి ఇండ స్ట్రీ పెద్దలు సహా యండమూరి చిరంజీవిని అలా అభివర్ణించడంతో మెగాస్టార్ గా మారారు. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ ఒరిజినల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కమల్ హాసన్ అసలు పేరు పార్ధ సారధి. నాలుగేళ్ల వయసులోనే ఆ పేరును మార్చి కమల్ హాసన్ అని పెట్టారు.
ఈ పేరు పెట్టింది కమల్ తండ్రి శ్రీనివాసన్. ఎందుకు మార్చారో తనకు తెలియదని కమల్ అంటున్నారు. పేరులో పువ్వు..నవ్వు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే అలా మార్చి ఉటారని కమల్ భావి స్తున్నారు. కమలం పువ్వు...హహ అనే నవ్వుతో అనే నవ్వులోనే నా పేరు ఉందన్నారు. అలా పార్ధసారధి కమల్ హాసన్ గా మారారు. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ లో నటిస్తున్నారు.
అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ లో ఈచిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 3 కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. థగ్ లైఫ్ అనంరం రిలీజ్ అవుతుంది.
