స్టార్ హీరో ‘ప్లాన్ B’: నిర్మాతల టెన్షన్‌కి కారణం ఇదే
ఒక సీనియర్ స్టార్ హీరో చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ సినిమాల లైనప్ సెట్ చేసుకోవాలి.
By: Tupaki Desk | 24 April 2026 3:00 PM ISTఒక సీనియర్ స్టార్ హీరో చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ సినిమాల లైనప్ సెట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అనౌన్స్ చేసిన ఒక ప్రాజెక్ట్ షూటింగ్‌కి నోచుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమా రిలీజ్‌కి డేట్ దొరకడం లేదు. దీంతో ఆ హీరో మీద ‘గ్యాప్’ పడుతుందనే టెన్షన్ స్టార్ట్ అయింది.
ఈ టెన్షన్‌కి మెయిన్ రీజన్ అతని నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. పాత హిట్ కాంబో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. బడ్జెట్ కూడా 200 కోట్లకు పైమాటే. అయితే సినిమాని టేకప్ చేసిన బ్యానర్ ప్రస్తుతం ఫైనాన్షియల్ బ్లాక్స్‌లో ఇరుక్కుందని టాక్. పైగా కొన్ని బయటి ఒత్తిళ్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మేకర్స్ ‘ఒక నెలలో అంతా క్లియర్ అవుతుంది’ అని చెబుతున్నా, లోపల మాత్రం హీరో మనసులో కన్ఫ్యూజన్ మొదలైందట.
ఇదే సమయంలో ఆ స్టార్ హీరో ముందస్తుగానే సెట్ చేసుకున్న ప్లాన్ B ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసిందట. కెరీర్‌లో ఎప్పుడూ లేనివిధంగా ఇద్దరు సీనియర్ నిర్మాతలను పర్సనల్‌గా కలిసి రిక్వెస్ట్ చేశాడట. ఒకవేళ ప్రస్తుత బ్యానర్ తేలకపోతే మీరు ఈ ప్రాజెక్ట్‌ని ఓన్ చేసుకోండి.. అనేది ఆయన ప్రపోజల్. ఒక స్టార్ స్థాయిలో ఉన్న హీరో ఇలా నిర్మాతల దగ్గరికి వెళ్లడం అనేది చాలా రేర్. దీన్నిబట్టి ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
మరి ఆ ఇద్దరు నిర్మాతలు ఎందుకు ఆలోచిస్తున్నారు? దానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండడం వలన రిస్క్ ఎక్కువ అని ఆలోచిస్తున్నారట. అలాగే దర్శకుడి ట్రాక్ రికార్డ్. మాస్ సినిమాలు తీస్తాడు కానీ, డబుల్ బ్లాక్ బస్టర్ అనే రేంజ్ హిట్ ఇవ్వలేదు. మరో ముఖ్యమైన విషయం మార్కెట్ సీన్. 2024, 2025లో భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్స్‌లో దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో అనుభవం ఉన్న నిర్మాతలు కూడా లెక్కలు పదే పదే వేసుకుంటున్నారు.
ఇది హీరోకి ప్రెస్టీజ్ ఇష్యూ కూడా. బ్లాక్‌బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ వస్తే మొమెంటమ్ పోతుంది. అందుకే సొంతంగా చొరవ తీసుకుని ప్రాజెక్ట్‌ని ముందుకు నడిపించాలని చూస్తున్నాడు. ఒకవేళ కొత్త నిర్మాతలు వస్తే బడ్జెట్‌లో కోత పడొచ్చు, లేదా స్క్రిప్ట్‌లో మార్పులు సూచించొచ్చు. ఏదేమైనా, నెక్స్ట్ 30 రోజులు ఈ ప్రాజెక్ట్‌కి చాలా కీలకం అని తెలుస్తోంది. ప్రస్తుత బ్యానర్ సమస్య తీరితే ఓకే, లేదంటే స్టార్ హీరో ‘ప్లాన్ B’ అమల్లోకి వస్తుంది.
