Begin typing your search above and press return to search.

హిట్టు కాంబినేషన్.. సెట్స్ లో గొడవలు?

అయితే పని విషయంలో మాత్రం హీరో తీరు మారటం లేదంటున్నారు. కెమెరా ఆన్ అయ్యాక పూర్తిగా తన పాత్రలోకి జారిపోయి పనిచేస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   22 May 2025 6:00 PM IST
హిట్టు కాంబినేషన్.. సెట్స్ లో గొడవలు?
X

వరుసగా సక్సెస్ లు చూసిన క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే వారి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చర్చలు ఎన్ని జరిగినా కూడా ఒకరిపై మరొకరికి చాలా ఫ్రెండ్లి వాతావరణం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఓ స్టార్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ సెట్స్ లో వాతావరణం హీటెక్కినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన హిట్ ట్రాక్ ఉంది. మూడు వరుస హిట్స్ చూశారు.

ఇక ఇప్పుడు మూడో సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అలాంటి మంచి కాంబినేషన్లో గొడవలు అంటే చూసిన వారికి షాకింగ్ గానే ఉంటుంది. ఇప్పటివరకు అన్ని ప్రాజెక్ట్స్‌కు 30 నిమిషాల కథను వినిపిస్తూ ముందుకు వెళ్లిన దర్శకుడు, ఈసారి మాత్రం పూర్తి కథ చెప్పాలని హీరో కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్ వచ్చినట్టు టాక్. ఇది దర్శకుడికి అంతగా నచ్చలేదట.

పైగా ఇటీవల హీరోయిన్ ఎంపిక, కథ మార్పులు వంటి విషయాల్లో దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ లేకపోవడం, విభేదాలకు దారితీసినట్టు ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సీనియర్ నటుడికి డైలాగ్స్ తడబాటుగా రావడంతో హీరో సహనాన్ని కోల్పోయినట్టు సమాచారం. అసిస్టెంట్ డైరెక్టర్లపై గట్టిగా ప్రశ్నించగా, దీనిపై డైరెక్టర్ మధ్యలోకి వచ్చి.. వాళ్లు నా టీం, మీకు ఏ సమస్యైనా ఉంటే నాకు చెప్పండి.. అంటూ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ మాటలు హీరోను కాస్త ఆశ్చర్యానికి గురి చేశాయట. ఇలా సెట్‌పై పరస్పర ఘర్షణలు జరగడం, అది ఎక్కువసార్లు పునరావృతం కావడం బృందాన్ని ఇబ్బందుల్లో పడేస్తోందట. తాజాగా జరిగిన ఓ షూటింగ్ లొకేషన్ ఈ విషయాన్ని మరోసారి హైలైట్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కాకుండా విదేశాల్లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో, యూనిట్ సభ్యులు అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నట్టు సమాచారం.

అయితే పని విషయంలో మాత్రం హీరో తీరు మారటం లేదంటున్నారు. కెమెరా ఆన్ అయ్యాక పూర్తిగా తన పాత్రలోకి జారిపోయి పనిచేస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ షూటింగ్ మధ్యలో తలెత్తే ఈ తలకోట్లు, ప్రొడక్షన్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని అంతర్గత సమాచారం. ఇలాంటి సందర్భాల్లో నిర్మాతల స్థానం చాలా క్లిష్టంగా మారుతోంది. ఇక ఆ మాస్ కాంబినేషన్ జోడి ప్రమోషన్ కు వచ్చేసరికి ఏ విధంగా ఉంటారో చూడాలి.