సెట్ కావాల్సిన క్రేజీ కాంబినేషన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసారు. కానీ చేతులు కలపాల్సిన కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఏర్పడుతాయి.
By: Tupaki Desk | 28 May 2025 11:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసారు. కానీ చేతులు కలపాల్సిన కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఏర్పడుతాయి. అలాంటి కొన్ని కాంబినేష్స్ చూస్తే.... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంతవరకూ గురూజీ త్రివిక్రమ్ తో కలిసి పనిచేయాలేదు. చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ ఎందుకనో ఇంకా ఆ కాంబినేషన్ సెట్ అవ్వ లేదు.
అందుకోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆ ఇద్దరి కాంబినేషన్ సెట్ చేసి పవన్ ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రచారం లో ఉంది. అలాగే ప్రభాస్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయలేదు. వీళ్లిద్దరు కూడా చేతులు కలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్ కి గురుజీ క్లాసిక్ స్టోరీ కం యాక్షన్ తోడైతే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అలాగే `పుష్ప`తో సుకుమార్ పాన్ ఇండియాలో ఓ సంచలనం అయ్యారు. ఇప్పుడీ సంచలనం ప్రభాస్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. 2000 కోట్లు ఒక్క పార్టుతోనే సాధ్యమవుతుంది. సుకు మార్ క్రియేటివిటీకి ప్రభాస్ అనే కటౌట్ తోడైతే మైండ్ బ్లాంక్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొత్త తరహా కాన్సెప్ట్ లను ప్రభాస్ ఎంకరేజ్ చేస్తాడు. సుకుమార్ క్రియేటివిటీకి అన్ని రకాలుగా సరితూగుతాడు డార్లింగ్.
ఇక రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ కూడా చేతులు కలపాలి. వాస్తవానికి ఇప్పటికే ఈ కాంబోలో సినిమా ఉంటుందని ప్రచారంలో కి వచ్చింది. కానీ తర్వాత సమీకరణాలు మారడంతో? ఆలస్యమవుతుంది. బుచ్చిబాబు...సుకుమార్ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే బాగుంటుందని అభిమా నులు భావిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగాతో చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ అంతా కూడా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నారు. ప్రభాస్ -సందీప్ కాంబోలో `స్పిరిట్` త్వరలోనే పట్టాలెక్కుతుంది. మరో పాన్ ఇండియా సంచలనం నాగ్ అశ్విన్ ప్రభాస్ మినహా స్టార్ హీరోలతో పని చేయాల్సి ఉంది.
