సితార యాక్టింగ్ కెరీర్ పరిస్థితి ఏంటి..?
స్టార్ వారసులకి తెరగేట్రం అన్నది పెద్ద కష్టమేమి కాదు. వాళ్లు ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడమే ఆలస్యం కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ పనంతా చేసేస్తారు.
By: Tupaki Desk | 23 May 2025 9:00 AM ISTస్టార్ వారసులకి తెరగేట్రం అన్నది పెద్ద కష్టమేమి కాదు. వాళ్లు ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడమే ఆలస్యం కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ పనంతా చేసేస్తారు. ఐతే స్టార్ హీరోల వారసులు వారి స్టార్ మేనియాని కొనసాగించేందుకు తెరంగేట్రానికి ముందే అంతా సంసిద్ధం అవుతారు. తమ ఫ్యామిలీ స్టార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేందుకు అన్ని విధాలుగా తమని తాము రెడీ చేసుకుంటారు. ఐతే స్టార్ ఫ్యామిలీ వారసుల పని అలా ఉంటే వారసురాళ్లు అదే అమ్మాయిల విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.
స్టార్ హీరో తనయుడు హీరోగా వస్తానంటే ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు కానీ అదే ఫ్యామిలీ నుంచి అమ్మాయి హీరోయిన్ గా వస్తుంది అంటే మాత్రం ఒప్పుకోరు. హీరోయిన్స్ అంటే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్లు ఆమె గురించి వేరే విధంగా మాట్లాడుతుంటారు. ఇలా ప్రతి విషయంలో కొన్ని ఇబ్బంది కరమైన విషయాలు ఉంటాయి. అందుకే స్టార్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు తెరంగేట్రం చేద్దామనుకున్నా ముందే వద్దని చెబుతారు.
ఐతే ఆ అడ్డుగోడలు దాటి కొందరు అలాంటి ప్రయత్నం చేశారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ఐతే ఆమె కథానాయికగా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా తెరంగేట్రం చేసింది. ఐతే నిహారిక హీరోయిన్ గా చేసినా సక్సెస్ అవ్వలేకపోయింది.
ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సితార కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందా అంటే ఏమో చెప్పలేం అంటున్నారు. మహేష్ గారాల పట్టి అయిన సితార ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తుంది. ఐతే ఆమె యాడ్స్ వరకే పరిమితం అవుతుందా సినిమాల్లో కూడా నటిస్తుందా అన్నదానికి క్లారిటీ లేదు. సీతా పాప సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారా లేదా అన్నది కూడా చెప్పడం కష్టం. మరి అప్పుడు మంజుల ఎంట్రీని వ్యతిరేకించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ సితార తెరంగేట్రం ని ప్రోత్సహిస్తారా లేదా అన్నది చూడాలి. ఐతే ఒకవేళ సితార ఇష్టంతో సినిమాలు చేసినా అవి ప్రత్యేకమైన కథలతో వచ్చే ఛాన్స్ లు ఉంటాయని చెప్పొచ్చు. మహేష్ వారసుడు గౌతం ఎలాగు ఏదో ఒక టైం లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడు. ఈలోగా సితార తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తుందా లేదా మహేష్ తో యాడ్స్ వరకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.
