Begin typing your search above and press return to search.

థమన్ కి మూడు పెద్ద పరీక్షలు.. జోరు కంటిన్యూ అయ్యేనా?

ఈ మధ్య కాలంలో థమన్‌ ఆల్బమ్స్ నిరాశ పరుచుతూ ఉండటంతో ఆయన జోరు తగ్గినట్లేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:01 AM GMT
థమన్ కి మూడు పెద్ద పరీక్షలు.. జోరు కంటిన్యూ అయ్యేనా?
X

తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన సంగీత దర్శకుడు థమన్. మహేష్ బాబు దూసుకుడు సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న థమన్‌ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అల వైకుంఠపురంతో పాటు పలు ఆల్బమ్స్ తో సూపర్‌ డూపర్ సక్సెస్ ని దక్కించుకున్నాడు.

థమన్‌ సంగీత సారథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా కూడా నిలిచాయి. ముఖ్యంగా ఆ సినిమాల మ్యూజిక్‌ ఆల్బమ్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి. థమన్‌ ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారాడు. దేవి శ్రీ ప్రసాద్ కి సమానమైన పారితోషికం అందుకున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది.

ఈ మధ్య కాలంలో థమన్‌ ఆల్బమ్స్ నిరాశ పరుచుతూ ఉండటంతో ఆయన జోరు తగ్గినట్లేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వైపు కొత్త సంగీత దర్శకులు దూసుకు వస్తున్న నేపథ్యంలో థమన్‌ కి ఆఫర్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

థమన్‌ చేతిలో ఇప్పుడు కూడా పెద్ద హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో గుంటూరు కారం, స్కంధ మరియు భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యి... మ్యూజికల్ హిట్ ను సాధిస్తే మరో ఏడాది రెండేళ్ల పాటు థమన్ జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో తమిళ దర్శకుడు అనిరుధ్‌ టాలీవుడ్ లో జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవర సినిమా తో మ్యూజికల్ హిట్ కొడితే ఆయనకు వరుసగా స్టార్‌ హీరోల సినిమాలకు వాయించే అవకాశాలు రావచ్చు.

మరో వైపు ఖుషి సినిమా తో హే శ్యామ్‌ సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొదటి సినిమా తోనే హే శ్యామ్‌ సంగీత దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కనుక థమన్ జాగ్రత్త పడి సక్సెస్‌ ను దక్కించుకుంటే తప్పితే ఇండస్ట్రీలో స్టార్‌ మ్యూజిక్ కంపోజర్ గా కొనసాగే ఛాన్స్ లు చాలా తక్కువ అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.