Begin typing your search above and press return to search.

SSMB 29.. రాజమౌళి టైటిల్ చెప్పే మొదలుపెడతాడా..?

సో మహేష్ సినిమాకు కూడా అలానే టైటిల్ కన్ ఫ్యూజన్ లేకుండా టైటిల్ చెప్పేసి సినిమా షూటింగ్ మొదలు పెడతారట.

By:  Tupaki Desk   |   18 April 2024 5:34 AM GMT
SSMB 29.. రాజమౌళి టైటిల్ చెప్పే మొదలుపెడతాడా..?
X

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు టాలీవుడ్ పై తన వీర ప్రతాపం చూపించిన మహేష్ ఇక మీదట పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వైడ్ గా తన మాస్ స్టామినా చూపించనున్నాడు. రాజమౌళి మహేష్ కాంబో అనగానే మహేష్ సినిమాల లిస్ట్ చూడటం మొదలు పెట్టారు ఇంటర్నేషనల్ ఆడియన్స్. అసలే మహేష్ కటౌట్ హాలీవుడ్ హీరోలకు దగ్గరగా ఉంటుంది. సో ఆ కటౌట్ కి తగ్గ కథ పడితే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అందరు ఫిదా అవ్వడం ఖాయం.

రాజమౌళి కూడా మహేష్ సినిమాను కేవలం ఒక తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఫారెస్ట్ అడ్వంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోయే ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పనిచేసారని తెలుస్తుంది. అయితే RRR తరహాలోనే SSMB 29 సినిమాను కూడా రాజమౌళి టైటిల్ మొదట చెప్పి సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది.

RRR సినిమా ప్రెస్ మీట్ టైం లో కూడా సినిమా టైటిల్ చెప్పి సినిమా గురించి డీటైల్స్ అన్నీ ప్రెస్ మీట్ లో చెప్పాడు రాజమౌళి. సో మహేష్ సినిమాకు కూడా అలానే టైటిల్ కన్ ఫ్యూజన్ లేకుండా టైటిల్ చెప్పేసి సినిమా షూటింగ్ మొదలు పెడతారట. సినిమా టైటిల్ యూనివర్సల్ అప్పీల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అదేంటో బయటకు తెలుస్తుందని చెప్పొచ్చు.

మహేష్ సినిమా కోసం 300 నుంచి 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో కూడా చేతులు కలుపుతున్నారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో జస్ట్ ఒక సాంగ్ కే ఆస్కార్ రాగా రాజమౌళి మహేష్ సినిమాతో మిగతా కేటగిరిల్లో కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.

సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేసుకుని జక్కన్న సినిమా రెడీ చేస్తాడట. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ గ్లోబల్ వైడ్ గా సూపర్ స్టార్ రేంజ్ తెలిసేలా చేసేందుకు కృషి చేస్తున్న రాజమౌళి ప్రయత్నాలను చూసి ముచ్చటపడుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా సినిమా గురించి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరెవరిని తీసుకుంటారా అన్నది కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.