Begin typing your search above and press return to search.

మహేష్ బాబుతో SS రాజమౌళి మూవీ లాంచ్ డేట్?

నిజానికి 2022లోనే ద‌ర్శ‌క‌దిగ్గ‌జం SS రాజమౌళి - మహేష్ బాబు కాంబినేష‌న్ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 1:30 PM GMT
మహేష్ బాబుతో SS రాజమౌళి మూవీ లాంచ్ డేట్?
X

రాజ‌మౌళితో #SSMB29 చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌య్యేదెపుడు? చాలా కాలంగా ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో నెల‌కొన్న ఉత్కంఠ ఇది. భార‌తీయ సినీపరిశ్ర‌మ‌ను ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ముహూర్తం ఎప్ప‌టికి సాధ్య‌ప‌డుతుంది? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ప్ర‌భాస్-రానా-ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ ల‌ను పాన్ ఇండియా స్టార్లుగా ఆవిష్క‌రించిన జ‌క్క‌న్న ఇప్పుడు మ‌హేష్ ని పాన్ ఇండియా/ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఆవిష్క‌రించేందుకు స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌న్న‌ది ఎగ్జ‌యిటింగ్ ఎలిమెంట్. దీంతో స‌ర్వ‌త్రా దేశంలోని సాధార‌ణ సినీప్రియులు, ప్ర‌జ‌లు స‌హా భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కూ ఏ ఇత‌ర పాన్ ఇండియా స్టార్ కి లేని క్రేజ్ మ‌హేష్ కి ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. అంత‌టి ఛ‌రిష్మా ప్ర‌తిభ అత‌డి సొంతం. అందుకే రాజ‌మౌళితో ఇప్పుడు మ‌హేష్‌ సినిమా లాంచింగ్ గురించి క‌ళ్లు కాయ‌లు కాసేలా ప్ర‌జ‌లు వేచి చూస్తున్నారు.

నిజానికి 2022లోనే ద‌ర్శ‌క‌దిగ్గ‌జం SS రాజమౌళి - మహేష్ బాబు కాంబినేష‌న్ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా #SSMB29 అని పేరు పెట్టారు. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో క‌థాంశం రెడీ అవుతోంది. కానీ విజ‌యేంద్రుడు చాలా కాలంగా రాజ‌మౌళితో క‌లిసి మ‌హేష్ సినిమా స్క్రిప్టు పైనే వ‌ర్క్ చేస్తూ కాల‌యాప‌న చేసారు. మ‌రోవైపు మ‌హేష్ త‌న ఫేవ‌రెట్ త్రివిక్ర‌మ్ సినిమా `గుంటూరు కారం`తో బిజీగా ఉన్నాడు. త్రివిక్ర‌మ్ తో సినిమా పూర్తి కాగానే రాజ‌మౌళితో మ‌హేష్ సెట్స్ కెళ‌తాడ‌ని ప్ర‌చార‌మైంది. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

తాజా క‌థ‌నాల ప్రకారం.. మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రిప‌రేష‌న్ పై ఇప్ప‌టికే చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ని తెలిసింది. ఇప్పుడు సూప‌ర్ స్టార్ కోసం రాజమౌళి స్పెషల్ ట్రైనింగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఎస్ఎస్ రాజమౌళితో తన సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సిద్ధం చేయడానికి మ‌హేష్‌ మూడు నెలల షెడ్యూల్‌ను అనుసరిస్తాడని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే షెడ్యూల్ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది (2024) సెప్టెంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే 2025 చివ‌రిలో రిలీజ్ కి ఆస్కారం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

SSMB29 భార‌త‌దేశంలో అత్యంత క్రేజీ చిత్రాలలో ఒకటిగా నిల‌వ‌నుంది. ఇది పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతుంది. రాజమౌళి - మహేష్ బాబు కలిసి పని చేయడం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తాజా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ క్రేజీ సినిమాలో న‌టించే మిగతా నటీనటుల విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. దీపికా పదుకొణె క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆఫ్రికాలోని ద‌ట్ట‌మైన అర‌ణ్యంలో చిత్రీకరిస్తామని, మహేష్ బాబును మునుపెన్నడూ చూడని స‌రికొత్త అవతార్‌లో చూపిస్తారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలోను ఇరుగు పొరుగు భాష‌ల నుంచి బ‌డాస్టార్ల‌తో సమిష్టి తారాగణం ఉండేట్టు జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నార‌ట‌. హాలీవుడ్ నుండి కొన్ని ప్రధాన పేర్లు ఉంటాయని కూడా సమాచారం. ఇందులో ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కే`లో భాగ‌మైన‌ కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. కానీ మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.