Begin typing your search above and press return to search.

నాడు లండ‌న్ రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ .. నేడు నార్వే ఒపెరా హౌస్

లండన్‌-రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో #బాహుబలి: ది బిగినింగ్ మ్యాజికల్ స్క్రీనింగ్ ఇప్పటికీ నా దృష్టిలో నిలిచిపోయిందని మర్చిపోలేను.

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:29 AM GMT
నాడు లండ‌న్ రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ .. నేడు నార్వే  ఒపెరా హౌస్
X

బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత! అనేంత‌గా సంచ‌ల‌నాలు సృష్టించారు SS రాజమౌళి. ద‌ర్శ‌క‌ధీరుడి అసమాన ప్ర‌తిభ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం ఈ ఫ్రాంఛైజీ. బాహుబ‌లి భార‌త‌దేశం స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఎన్నో రికార్డుల‌ను బ్రేక్ చేసింది.

నేడు భార‌తీయ సినిమా స్థాయి అమాంతం పెర‌గ‌డం వెన‌క బాహుబ‌లి స్ఫూర్తి ఎన్న‌ద‌గిన‌ది. లండన్‌లోని ప్రఖ్యాత యాంఫీథియేటర్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి: ది బిగినింగ్‌ను ప్రదర్శించడం అతిపెద్ద గౌరవాలలో ఒకటి.

దాదాపు 148 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రత్యేక ప్రదర్శనను కలిగి ఉన్న మొట్టమొదటి ఆంగ్లేతర చిత్రంగా బాహుబ‌లి చ‌రిత్ర సృష్టించింది. బాహుబ‌లిని వీక్షించిన హాలీవుడ్ ప్ర‌ముఖులంతా నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టి మ‌రీ గౌర‌వించారు. నాటి తీపి గురుతులు విజ‌యాల‌ను రాజ‌మౌళి అండ్ టీమ్ ఇంకా మ‌ర్చిపోలేదు. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. అప్ప‌ట్లో రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హౌస్ లో స్వరకర్త ఎంఎం కీరవాణి .. అతని బృందం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రదర్శించారు. దీనిని వేలాది మంది ప్రేక్షకులు వీక్షించారు.

లండన్‌-రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో #బాహుబలి: ది బిగినింగ్ మ్యాజికల్ స్క్రీనింగ్ ఇప్పటికీ నా దృష్టిలో నిలిచిపోయిందని మర్చిపోలేను. ఇప్పుడు మేము ఆగస్ట్ 18న నార్వేలో స్టావాంజర్ ఒపెరా హౌస్‌లో బాహుబలి-1 కాన్సర్ట్ స్క్రీనింగ్‌లో మరో అద్భుతమైన దృశ్యం కోసం సంతోషిస్తున్నాము అంటూ రాజ‌మౌళి ప్ర‌క‌టించారు.

ఈ ప్రత్యేక ప్రదర్శనలో స్టావాంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంద‌ని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి ఈ వార్తను ఎంతో సంతోషంగా ట్వీట్ చేశారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో #బాహుబలి: ది బిగినింగ్ మ్యాజికల్ స్క్రీనింగ్ ఇప్పటికీ నా దృష్టిలో నిలిచిపోయిందని ఆయన అన్నారు.

ఆగస్ట్ 18న స్టావాంజర్ ఒపెరా హౌస్‌లో నార్వేలో బాహుబలి-1 కచేరీ స్క్రీనింగ్‌లో స్టావాంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో ఇప్పుడు మరో అద్భుత మైలురాయిని అందుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము. బాహుబలి రెండవ భాగం విడుదలైన ఆరేళ్ల తర్వాత కూడా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఈ స్క్రీనింగ్‌కు రాజమౌళి, నిర్మాత శోబు యార్లగడ్డ హాజరుకానున్నారు. వీరితో పాటు ప్ర‌భాస్ - రానా హాజ‌ర‌వుతారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.