Begin typing your search above and press return to search.

SSMB29.. అసలు కథ ఎంత వరకు వచ్చింది?

దీంతో ఇప్పుడు విజయేంద్రప్రసాద్ టీమ్ స్క్రిప్ట్ పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ వైపు జక్కన్న స్క్రిప్ట్ లో మార్పులు చేయిస్తూనే మరో వైపు క్యాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 8:30 AM GMT
SSMB29.. అసలు కథ ఎంత వరకు వచ్చింది?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతోంది. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసి రాజమౌళికి ఇచ్చారంట. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ బేసిక్ అవుట్ లైన్ అయితే రాజమౌళి మైండ్ లో ఉంది.

ఇక ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే బాధ్యతని తండ్రి విజయేంద్రప్రసాద్ ని జక్కన్న అప్పగించారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారంట. అందులో భాగంగా స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళి అంత సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తం మరల రివైజ్ చేయమని రైటింగ్ టీమ్ కి సూచించారంట

దీంతో ఇప్పుడు విజయేంద్రప్రసాద్ టీమ్ స్క్రిప్ట్ పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ వైపు జక్కన్న స్క్రిప్ట్ లో మార్పులు చేయిస్తూనే మరో వైపు క్యాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. మహేష్ బాబుకి జోడీగా ఇండోనేసియా బ్యూటీని ఫైనల్ చేశారని ప్రచారం నడుస్తోంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయిన ఆమె సినిమాలో చేయడం ఖాయం అని టాక్.

ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ మూడ్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి మూవీ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు. సినిమాలో రెండు డాన్స్ బీట్స్ చేయడానికి కారణం చెప్పారు. గుంటూరు కారం తర్వాత మరల మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చని, అందుకే ఈ సినిమాలో సరదా తీర్చుకున్నట్లు తెలిపారు.

కొద్ది రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత రాజమౌళి సినిమా ప్రీప్రొడక్షన్ యాక్టివిటీస్ పై మహేష్ బాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహించబోతున్నారు. మరి అఫీషియల్ గా ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి.