Begin typing your search above and press return to search.

SSMB 29పై న‌రేష్ ఏమ‌న్నారంటే?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 29వ చిత్రం పాన్ ఇండియాలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:30 AM GMT
SSMB 29పై న‌రేష్ ఏమ‌న్నారంటే?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 29వ చిత్రం పాన్ ఇండియాలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ చిత్ర‌మిది. ఇప్ప‌టికే స్టోరీ కూడా లాక్ అయింది. దిగ్గ‌జ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మ‌హేష్ ఇమేజ్ ని..పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అద్భుత‌మైన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా మ‌లిచారు. `బాహుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్` రికార్డుల‌ను తిర‌గ‌రాసే సినిమా అవుతుంద‌ని అంద‌రిలోనూ అంచ‌నాలున్నాయి.

పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేసే సినిమ అవుతుంద‌ని అభిమాన‌లు భావిస్తున్నారు. ఇందులో మ‌హేష్ ఎలా క‌నిపించ‌నున్నాడు? అన్న ఆస‌క్తి అప్పుడే మొద‌లైపోయింది. హీరోల్ని డిఫ‌రెంట్ లుక్ లోకి మార్చ‌డం జ‌క్క‌న్న ప్ర‌త్యేక‌త‌. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ లుక్ ఎలా ఉంటుంది? అన్న ఆస‌క్తి అంత కంత‌కు అందరిలోనూ రెట్టింపు అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళ్తుందా? అని అంతా ఆస‌క్తి ఎదురు చూస్తోన్న త‌రుణ‌మిది.

అలాగే మ‌హేష్ కి జోడీగా ఏ బ్యూటీని దించుతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అవ‌న్నీ ప‌క్క‌న బెడితే తాజాగా ఈ సినిమా గురించి సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `మహేష్‌కి మాస్‌- క్లాస్‌ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. భారతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రాజమౌళి. వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా తెలుగు చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను` అని అన్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప‌నుల్లోనే రాజ‌మౌళి బిజీగా ఉన్నారు. స్టోరీ రెడీ అయిన నేప‌థ్యంలో జ‌క్క‌న్న మిగ‌తా ప‌నుల‌పై దృష్టి పెట్టారు. మ‌హేష్ ఇటీవ‌లే `గుంటూరు కారం `సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా పై తొలుత నెగిటివ్ టాక్ వ‌చ్చింది. అటుపై వ‌సూళ్లు మెరుగ్గానూ క‌నిపిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.