Begin typing your search above and press return to search.

SSMB 29: జక్కన్న టీమ్ సెట్.. రిలీజ్ ఎప్పుడు?

అయితే ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమా విషయంలో చాలా మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 6:22 AM GMT
SSMB 29: జక్కన్న టీమ్ సెట్.. రిలీజ్ ఎప్పుడు?
X

దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్రాండ్ గా పాన్ వరల్డ్ రేంజ్ లో తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనే విషయాల కన్నా కూడా రాజమౌళి టీం గురించి ప్రస్తుతం ఎక్కువ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాజమౌళి తన కెరీర్లో టీంను మార్చిన సందర్భాలు అయితే చాలా తక్కువ.

వీలైనంతవరకు ఆయనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ మళ్లీ నెక్స్ట్ ప్రాజెక్టులకు కూడా కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమా విషయంలో చాలా మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ ఇప్పటికే 1500 కోట్లు అని రకరకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. హాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది అని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విషయంలో మార్పు లేదు. అయితే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కాకుండా ఈసారి జక్కన్న పీఎస్ వినోద్ ను సెలెక్ట్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మరొకవైపు రాజమౌళి ఎడిటర్ గా బాహుబలి వరకు కోటగిరి వెంకటేశ్వరరావు వర్క్ చేశారు. ఇక RRR సినిమాకు శ్రీకర్ ప్రసాద్ వర్క్ చేయగా ఈసారి తమ్మిరాజును సెలెక్ట్ చేసుకున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా RRR బాహుబలి వరకు ఉన్న శ్రీనివాస్ మోహన్ కాకుండా ఈసారి కమల్ కన్నన్ రంగంలోకి దిగాడు. గతంలో ఈగ, మగధీర సినిమాలకు ఈయనే వర్క్ చేశారు. ఇక రైటర్ గా విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఎప్పటిలానే రామ రాజమౌళి వర్క్ చేయబోతున్నారు.

ఇక హీరోయిన్ విషయంలో మాత్రం లేటెస్ట్ గా రకరకాల గాసిప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇండోనేషియా భామ చెల్సియా ఇస్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వవైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టును సమ్మర్ అనంతరం మొదలుపెట్టి 2026 ఉగాది సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ప్రాజెక్టు మొదలయ్యే వరకు ఆగాల్సిందే.