Begin typing your search above and press return to search.

SSMB29 రియ‌ల్ సూప‌ర్‌మేన్ హ‌నుమాన్‌గా మ‌హేష్‌?

ఆఫ్రికన్ జంగిల్ లో సాగే సాహ‌సాల నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి.మహేష్ బాబు పాత్ర లార్డ్ హనుమంతుని పోలి ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:28 AM GMT
SSMB29 రియ‌ల్ సూప‌ర్‌మేన్ హ‌నుమాన్‌గా మ‌హేష్‌?
X

మహేష్ బాబు - SS రాజమౌళి చిత్రానికి SSMB29 అనేది తాత్కాలిక వ‌ర్కింగ్ టైటిల్. గతేడాది ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమా హిస్ట‌రీలో నెక్ట్స్ లోవ‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుందనేది బ‌ల‌మైన‌ టాక్. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించనున్నారు. తాజా స‌మాచారం మేర‌కు.. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా SSMB29 పోస్టర్‌తో ప్రాజెక్ట్ అధికారికంగా ఖాయ‌మ‌వుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే సమాచారం అందింది. SS రాజమౌళి చిత్రం కోసం సూపర్ స్టార్ మ‌హేష్‌ మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు కౌంట్‌డౌన్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ పాత్ర చిత్ర‌ణ ఎలా ఉంటుంది? అంటూ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. మహేష్ బాబు పాత్ర హనుమంతుడి నుండి ప్రేరణ పొందిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామాయణం - మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్ష‌న‌ల్ పాత్ర‌లు క‌థాంశంతో మ‌హేష్ సినిమాని రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన ఘాడ‌మైన లోతైన అంశాల‌ను జ‌క్క‌న్న ట‌చ్ చేస్తారు.

ఆఫ్రికన్ జంగిల్ లో సాగే సాహ‌సాల నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి.మహేష్ బాబు పాత్ర లార్డ్ హనుమంతుని పోలి ఉంటుంది. అత‌డు అడవిలో అరాచ‌కుల‌పై పోరాడే వీరుడిగా క‌నిపిస్తాడు. వాస్తవానికి రామాయణంలో హ‌నుమాన్ చేసిన సాహ‌సాల‌ మార్గాన్ని అనుసరించేలా పాత్ర‌చిత్ర‌ణ ఉంటుంది. కానీ SS రాజమౌళి పాత్ర‌ను ఫిక్ష‌న‌లైజ్ చేసి ఒక కొత్త సూప‌ర్ మేన్ ని ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

SSMB29 కాన్వాస్ RRR కంటే అతి భారీగా ఉంటుందని రాజ‌మౌళి తండ్రి, స్క్రీన్ రైటర్ కెవి విజయేంద్ర ప్రసాద్ ఇప్ప‌టికే వెల్లడించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

మహేష్ బాబు మూడు నెలల పాటు వర్క్‌షాప్‌లో శిక్షణ పొందనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్, థ్రిల్స్ తో ఎమోష‌న‌ల్ డ్రామా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో అంచ‌నాలున్నాయి.

దానికి త‌గ్గ‌ట్టుగా పాన్ వ‌ర‌ల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కించ‌డం ద్వారా ప్ర‌పంచంలోని అన్ని మూల‌ల్లో మార్కెట్ ప‌రిధిని విస్త‌రించేలా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నారు. పాపుల‌ర్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడానికి దర్శకుడు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడు. నటీనటులు సిబ్బంది ఎవ‌రు అన్న‌ది ఇంకా ప్రకటించక‌పోయినా..ఇందులో దీపికా పదుకొణెను క‌థానాయిక‌గా పరిశీలిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి.