Begin typing your search above and press return to search.

SSMB29: మహేష్ కోసం విదేశీ అమ్మాయి?

హాలీవుడ్ సినిమాలలో నటిస్తోన్న ఇండోనేషియా యాక్టర్ చెల్సియా ఇస్లాన్ ని జక్కన్న క్యాస్టింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకి స్క్రీన్ టెస్ట్ చేసి మూవీ కోసం ఫైనల్ చేసుకున్నారంట.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:56 AM GMT
SSMB29: మహేష్ కోసం విదేశీ అమ్మాయి?
X

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మూవీలో సూపర్ స్టార్ మహేష్ అడ్వంచర్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. కంప్లీట్ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మూవీ నడుస్తుందనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందంట. మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత జక్కన్న ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రీప్రొడక్షన్ వర్క్ కోసమే జక్కన్న చాలా టైం తీసుకుంటారు. వర్క్ షాప్స్ నిర్వహిస్తారు. ఈ లోపే క్యాస్టింగ్ ఖరారు చేస్తారు. సూపర్ స్టార్ తో చేయబోయే మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకునే ని ఫైనల్ చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే తాజాగా ఫారిన్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్ సినిమాలలో నటిస్తోన్న ఇండోనేషియా యాక్టర్ చెల్సియా ఇస్లాన్ ని జక్కన్న క్యాస్టింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకి స్క్రీన్ టెస్ట్ చేసి మూవీ కోసం ఫైనల్ చేసుకున్నారంట. దాదాపు ఆమె సినిమాలో నటించడం ఖాయమైపోయినట్లే.

అయితే ఈ బ్యూటీ మహేష్ బాబుకి జోడీగా నటిస్తోందా లేదంటే వేరొక కీ రోల్ కోసం ఎంపిక చేశారా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం సినిమాలో చాలా పాత్రలకి సంబందించిన క్యాస్టింగ్ సెలక్షన్స్ లో జక్కన్న ఉన్నారనే టాక్ నడుస్తోంది. వీలైనంత వేగంగా అన్ని పాత్రలకి నటీనటులని ఎంపిక చేస్తే వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనతో జక్కన్న ఉన్నారంట.

సుమారు 1500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండనుంది. అలాగే హాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేయనున్నారంట. ప్రతినాయకుడిగా ఒక హాలీవుడ్ స్టార్ యాక్టర్ ని రంగంలోకి దించనున్నారంట.