ఎస్ ఎస్ ఎంబీ 29 అప్పుడే పాట!
మహేష్ లేని సాంగ్ కావడంతో తాజా పాటని కొరియోగ్రఫర్ల మీద వదిలేసారు. మరి ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో తెలియాలి.
By: Tupaki Desk | 13 May 2025 7:41 PM IST# ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మహేష్-రాజమౌళి ఆన్ సెట్స్ లో లేకపోయినా షూటింగ్ మాత్రం బ్రేక్ పడలేదు.అదెలా అంటారా? ప్రస్తుతం జనవాడలో ఓపాట చిత్రీకరిస్తున్నారు. కొరి యోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ పాట షూటింగ్ జరుగుతుంది. మరి మహేష్ లేకుండా ఎలా అంటే? ఆయన లేని పార్ట్ ను షూట్ చేస్తున్నారు. విదేశాల నుంచి తిరిగి రాగానే మహేష్ పాల్గొంటాడు.
ప్రస్తుతం మహేష్ కూడా లండన్ టూర్ లోనే ఉన్నాడు. రాజమౌళి కూడా 'ఆర్ ఆర్ ఆర్' ఈవెంట్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్నటి రాత్రి ఈవెంట్ పూర్తయింది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటారు. జూన్ నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. రాజమౌళి ఆ షెడ్యూల్ కి సంబంధించి కొంత ప్రీ వర్క్ చేస్తున్నారు. ఆ పనులు మే నెలఖరుకల్లా పూర్తవుతాయని సమాచారం.
ఈ నేపథ్యంలో మూడవ షెడ్యూల్ జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిషాలో కొంత భాగం చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. రెండు షెడ్యూళ్లగా ఆయా లొకేషన్లలో చిత్రీకరణ పూర్తి చేసారు. అటుపై రాజమౌళి బ్రేక్ ఇవ్వడంతో కొరియోగ్రాఫర్లు సాంగ్స్ షూట్ కోసం రంగంలోకి దిగారు. పాటలకు సంబంధించిన పర్యవేక్షణ కూడా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటున్నారు.
మహేష్ లేని సాంగ్ కావడంతో తాజా పాటని కొరియోగ్రఫర్ల మీద వదిలేసారు. మరి ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో తెలియాలి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో పాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అవసరం కొన్ని పాటల్నే అందంగా చూపించారు. స్టోరీపై మాత్రమే ఫోకస్ చేసి ఆ రెండు చిత్రాలు తెరకెక్కించారు. ఎస్ ఎస్ ఎంబీ 29 కూడా అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి పాటలకు ఆస్కారం తక్కువగానే ఉండొచ్చు.
