ఎస్ ఎస్ ఎంబీ 29 అసలు కథ రామాయణమా!
ఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jun 2025 1:52 PM ISTఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిందల్లా ఒకటే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్. ఇదే కథను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా చూపించబోతున్నారు. ఇంతకు మించి సినిమాకు సంబంధించి ఇంకే విషయం తెలియదు.
అయితే ఈ కథకు స్పూర్తి రామాయణం అన్న సంగతి వెలుగులోకి వస్తోంది. ఇందులో మహేష్ పాత్ర రామాయణంలో హనుమంతుడిని పోలి ఉంటుందంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఇండియానా జోన్స్ యాక్షన్ శైలి సినిమా తీయాలన్నది రాజమౌళి కల. చనిపోయిన వారిని బ్రతికించే ఓశక్తి ఉందని పురాణాల్లో అంత పవర్ ఉన్నది కేవలం సంజీవని చెట్టుకే అని రామాయణం చెబుతుంది.
రామాయణంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్ యుద్దం కారణంగా రాముడి సోదరుడు లక్ష్మణుడు తీ వ్రంగా గాయపడతాడు. ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. దీంతో రాముడు వెంటనే హనుమంతుడిని పిలిచి హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలిక తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని ఎస్ ఎస్ ఎంబీ 29 కథని రైటర్ విజయేంద్ర ప్రసాద్ సిద్దం చేసినట్లు వినిపిస్తుంది.
ఇందులో మహేష్ పాత్రను హనుమంతుడి పాత్ర స్పూర్తితో రాసినట్లు లీకులందుతున్నాయి. దీంతో ఈ కథకు ఇతిహాస పురాణాలు స్పూర్తి అని తెలుస్తోంది. కథను గొప్పగా డ్రెమటైజ్ చేయగల రైటర్ విజయేంద్ర ప్రసాద్. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి కథలన్నీ అలా పుట్టినవే.