Begin typing your search above and press return to search.

రాజమౌళి.. అది కూడా స్ట్రాటజీలో భాగమే!

కొద్ది రోజుల క్రితం SSMB 29 మూవీ షూటింగ్ మొదలైన సంగతి విదితమే. ఇప్పటికే ఒడిశా, హైదరాబాద్ సహా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుందని సమాచారం.

By:  Tupaki Desk   |   31 May 2025 7:00 PM IST
రాజమౌళి.. అది కూడా స్ట్రాటజీలో భాగమే!
X

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌ లో SSMB 29 ప్రాజెక్ట్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న మూవీని కేఎల్ నారాయణ సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోస్ట్ అవైటెడ్ మూవీకి కథ అందించారు.

కొద్ది రోజుల క్రితం SSMB 29 మూవీ షూటింగ్ మొదలైన సంగతి విదితమే. ఇప్పటికే ఒడిశా, హైదరాబాద్ సహా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుందని సమాచారం. మహేష్ పై కొన్ని యాక్షన్ సీన్స్ తీయగా.. తొలిసారి ఆయన సినిమాలో బాడీ చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ కూడా మొదలు కానున్నట్లు వినికిడి.

అయితే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ అనగానే నెవ్వర్ బిఫోర్ అనేలా మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మూవీ.. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతుందని తెలియగానే.. అంచనాలు మరింత పెరిగాయి. దీంతో సినిమా కోసం ఎంతో ఈగర్ గా.. అటు అభిమానులు.. ఇటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు జక్కన్న ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రియాంక చోప్రా నటిస్తుందని ఆమె కామెంట్ ద్వారా తెలిసింది. అంతకుమించి ఒక్కటంటే ఒక్క పిక్ కాదు కదా.. ఏం కూడా చెప్పలేదు జక్కన్న. దీంతో ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు.

నిజానికి.. రాజమౌళి తాను తెరకెక్కించిన సినిమాల వివరాలు షూటింగ్ కు ప్రారంభానికి ముందే వెల్లడిస్తారు. ఓ ప్రెస్ మీట్ పెట్టి అన్నీ వివరిస్తారు. ఆయన గత చిత్రం ఆర్ఆర్ఆర్ టైమ్ లో అదే జరిగింది. ఇప్పుడు SSMB 29 ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరుగుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఎంతో వెయిట్ చేశారు.

ఇదిగో అదిగో అంటున్నా.. జక్కన్న ప్రెస్ మీట్ పెట్టడం లేదు. మౌనంగానే ఉంటున్నారు. అయితే అది కూడా ఆయన స్ట్రాటజీలో భాగం లాగానే ఉందని ఇప్పుడు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ విషయం చెప్పకుండా దాస్తే.. సినిమా రిలీజ్ టైమ్ కు ఇంకా ఆత్రుత, ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారని అంటున్నారు. రాజమౌళి ఏం చేసినా.. దాని వెనుక పక్కా ప్లాన్ ఉంటుందని అంతా చెబుతున్నారు.