Begin typing your search above and press return to search.

రాజమౌళి రూట్ మార్చి షాక్ ఇస్తున్నాడుగా..?

ఐతే మహేష్ సినిమాకు మరీ అంత టైం తీసుకోకూడదని రాజమౌళి ఫిక్స్ అవ్వడమే కాకుండా మహేష్ కి ఫుల్ ఫ్రీడం ఇచ్చినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   17 April 2025 9:55 PM IST
రాజమౌళి రూట్ మార్చి షాక్ ఇస్తున్నాడుగా..?
X

దర్శకధీరుడు రాజమౌళి RRR తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. మహేష్ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచరస్ థీమ్ తో తెరకెక్కిస్తున్న జక్కన్న ఇందులో డివోషనల్ టచ్ కూడా ఇస్తాడని టాక్. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ పేపర్ మీదే సూపర్ ఎగ్జైటెడ్ గా అనిపించగా రాజమౌళి టేకింగ్ తో దాన్ని వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

మామూలుగా అయితే రాజమౌళి సినిమా అంటే 3 ఏళ్లు డేట్స్ ఇచ్చేయాలి.. జక్కన్న సినిమా తప్ప మరో సినిమా ఆలోచన చేయకూడదు. ఇంక హాలీవ్డేస్ లు గట్రా ఉండవు. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి అతను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా రాజమౌళి సెల్ లో అరెస్ట్ అన్నట్టే ఉండాల్సిందే. అదే కాకుండా రాజమౌళి సినిమాలో హీరోల లుక్స్ అదిరిపోతాయి. మిగతా దర్శకులకు తనకు ఆ సెపరేషన్ ఏంటన్నది చూపిస్తాడు జక్కన్న.

ఐతే మహేష్ సినిమాకు మరీ అంత టైం తీసుకోకూడదని రాజమౌళి ఫిక్స్ అవ్వడమే కాకుండా మహేష్ కి ఫుల్ ఫ్రీడం ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే షెడ్యూల్ షెడ్యూల్ కి ఉన్న చిన్న గ్యాప్ లో మహేష్ ఫారిన్ ట్రిప్ లు కూడా వేసి వస్తున్నాడు. మహేష్ లుక్స్ కూడా మరీ కొత్తగా ఏమి లేదు. జస్ట్ కాస్త హెయిర్, గడ్డం పెంచాడు అంతే అన్నట్టుగా ఉంది. మహేష్ కూడా ఆ లుక్ తో యాడ్స్ చేస్తున్నాడి.

ఇలా తన సినిమా హీరో లుక్ ని మహేష్ ఇలా బయట రివీల్ చేయడం వాణిజ్య ప్రకటనలు చేయడం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఫారిన్ ట్రిప్ లు వేయడం ఇదంతా రాజమౌళి సినిమా టైం లో మహేష్ చేస్తున్న యాక్టివిటీస్. మరి ఇన్ని చేస్తున్న మహేష్ విషయంలో రాజమౌళి ఎందుకు అంత ఫ్రీగా ఉన్నాడన్నది తెలియట్లేదు. మిగతా హీరోలు సినిమాలోని గెటప్ తో బయట కనిపిస్తే చాలు అగ్గిమీద గుగ్గీలయ్యే రాజమౌళి మహేష్ కి ఎందుకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడన్నది ఎవరికీ అర్ధం కావట్లేదు.

ఏది ఏమైనా రాజమౌళిలోని ఈ మార్పు ఆడియన్స్ కి కూడా షాక్ ఇస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాను కూడా 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అది జరిగింది అంటే మాత్రం జక్కన్న కూడా తనని తాను మార్చుకోవడంలో సక్సెస్ అయినట్టే లెక్క.