Begin typing your search above and press return to search.

రూటు మార్చిన జక్కన్న.. మళ్ళీ చెక్కుతున్నారా?

స్టార్ దర్శకుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించినప్పచి నుంచి ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

By:  Tupaki Desk   |   17 July 2025 8:00 PM IST
రూటు మార్చిన జక్కన్న.. మళ్ళీ చెక్కుతున్నారా?
X

స్టార్ దర్శకుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించినప్పచి నుంచి ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ గానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి కెన్యాకు వెళ్లాల్సి ఉంది.

కెన్యాలో ఈ వారమే షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. యాక్షన్ అడ్వేంచర్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండంతో కెన్యా లొకేషన్స్ ఓకే చేసి పెట్టుకుంది రాజమౌళి టీమ్. అయితే అక్కడ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి కారణంగా మూవీటీమ్ కెన్యా షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకుంది. భద్రత కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త లొకేషన్ కోసం సెర్చింగ్ ప్రారంభించారు.

ప్రత్యామ్నాయంగా అడవి బ్యాగ్రౌండ్ ప్రాంతాల కోసం చిత్ర బృందం వెతుకుతోంది. అయితే ఈ మధ్యలో గ్యాప్ ను రాజమౌళి అడ్వాంటేజ్ గా మార్చుకునే ప్లాన్ లో ఉన్నారు. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని జక్కన్న భావిస్తున్నారు. దీనిపై హీరో మహేష్ తోనూ చర్చించారు. ఇద్దరూ ఓకే అనుకొని ఈ గ్యాప్ లో కథలో మార్పులు చేస్త్తున్నారు.

కాగా, కొత్త షెడ్యూల్ కు లొకేషన్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ కు సౌతాఫ్రికాను ఎంపిక చేసారట. ఆగస్టులోనే అక్కడ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఇది సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ కు ఓ తీపి కబురు లాంటిదే.

అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనపించనున్నారు. ఇందుకోసం ఆయన స్పెషల్ వర్కౌట్లు చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో కె.ఎల్. నారాయణ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.