బాహుబలి - RRR.. మహేష్ సినిమా కోసం మాత్రం ఇలా..
రాజమౌళి సినిమా అంటేనే.. పక్కా హిట్టు బొమ్మ అని అర్థం. ఇక దేశవ్యాప్తంగా హైప్.. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 25 Jun 2025 10:57 AM ISTరాజమౌళి సినిమా అంటేనే.. పక్కా హిట్టు బొమ్మ అని అర్థం. ఇక దేశవ్యాప్తంగా హైప్.. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తీసే ఒక్కో ప్రాజెక్ట్, భారత సినిమా విజువల్ ప్రయాణానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తున్నాయి. బాహుబలి ఫ్రాంచైజ్‌తో ఇండియన్ సినిమాకు ఒక పాన్ ఇండియా ట్రాక్ సెట్టయ్యింది. ఆ తరువాత RRR తో హాలీవుడ్‌కు దగ్గరయ్యాడు.
ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 కోసం మాత్రం రాజమౌళి కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఫార్ములాలను పక్కనపెట్టి, పూర్తిగా డిఫరెంట్ ప్లానింగ్‌లో వెళ్లిపోతున్నారు. బాహుబలి సమయంలో మెయిన్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ మీదే తెరకెక్కించారు. RRR కూడా ఎక్కువ భాగం గ్రాఫిక్స్‌తో ఇండోర్ లొకేషన్లలోనే చిత్రీకరించారు.
కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం మూడు రకాల ప్లానింగ్‌ను మిక్స్ చేయబోతున్నారని సమాచారం. భారీ సెట్స్, రియల్ లొకేషన్స్, వీఎఫ్‌ఎక్స్.. ఈ మూడింటినీ సమతూకంగా వినియోగించేందుకు రాజమౌళి చాలా గ్రాండ్ గా ట్రై చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఆయన కెరీర్‌లో ఓ కొత్త వర్క్ ఫార్మాట్ గా నిలవొచ్చు.
ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఒడిషాలో పూర్తి చేశారు. ప్రస్తుతానికి ప్రధానమైన బేస్ కాంప్ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ, ఆఫ్రికాలోని కెన్యాలో మరో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోనే 50 కోట్లతో కళాత్మకంగా నిర్మిస్తున్న ప్రాచీన కాశి నగరం సెట్ ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ సెట్‌లో హీరో పాత్రకు సంబంధించిన కీలక భాగం చిత్రీకరించనున్నట్టు టాక్.
ఈ మూవీ కోసం మహేష్ బాబు పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. లుక్‌లో మార్పు, యాక్షన్ ప్రిపరేషన్, బాడీ టోన్ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసే నటుల ఎంపిక కూడా రాజమౌళి విజన్‌ను హైలెట్ చేస్తోంది. గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమౌళి కొత్త స్టైల్ మేకింగ్ గా హైలెట్ కాబోతోంది.
ఇక గత సినిమాల్లో విన్న, చూసిన రాజమౌళి మార్క్ విజువల్స్‌కు ఇది మరో అడుగు ముందుగానే మిగిలిపోతుంది. గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా, లైవ్ లొకేషన్లు, నేచురల్ సౌండ్‌లు, ట్రెడిషనల్ సెట్స్ అన్నీ మిక్స్ కానున్నాయి. దాంతో ప్రేక్షకులకు ఒక నిజమైన ప్రపంచాన్ని చూపిస్తూనే, మాయాజాలాన్ని కూడా అందించాలన్న రాజమౌళి ఆలోచన ఇది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, ఫ్యూచర్ ఇండియన్ సినిమా మేకింగ్‌కు ఇది గైడ్‌లైన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, 2026లో ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
