Begin typing your search above and press return to search.

ఎవరి ఊహకు అందని రేంజ్ లో SSMB : పృథ్వీరాజ్

పృథ్వీరాజ్‌ లేటెస్ట్ మూవీ సర్జమీన్‌. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన SSMB29 గురించి మాట్లాడారు. ఎవరి ఊహకు అందని రీతిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది ఒక అద్భుత దృశ్య కావ్యం.

By:  Tupaki Desk   |   24 July 2025 7:30 PM IST
ఎవరి ఊహకు అందని రేంజ్ లో SSMB : పృథ్వీరాజ్
X

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కతున్న SSMB29 సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది. ఇటీవల కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో కొత్త షెడ్యూల్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

పృథ్వీరాజ్‌ లేటెస్ట్ మూవీ సర్జమీన్‌. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన SSMB29 గురించి మాట్లాడారు. ఎవరి ఊహకు అందని రీతిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది ఒక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి సార్‌ ఎంపిక చేసిన కథలు భారీగా ఉంటాయి. ఈ సినిమా స్టోరీ కూడా అలాంటిదే. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా స్టోరీ చెప్పడంలో ఆయన ఆయనే సాటి. ఈ సినిమాను ఆయన విజువల్‌ ట్రీట్‌ గా తెరకెక్కిస్తున్నారు. అని పృథ్వారాజ్ SSMB29 గురించి చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా ప్రకటించిప్పటిక నుంచి ఎలాంటి అప్డేట్ అధికారికంగా బయటకు రాలేదు. అందుకే సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ కామెంట్స్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కాగా, కెన్యా షెడ్యూస్ క్యాన్సిల్ అవ్వడంతో ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాలో చిత్రీకరణ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందుకోసం జక్కన్న టీమ్ లొకషన్ల వేట కూడా మొదలెట్టాయని తెలిసింది. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభం కానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ సో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట.

ఇక ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి రూపొందుతోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ అని అంచనా ఉంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, కే ఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు.