Begin typing your search above and press return to search.

బాహుబలి స్కెచ్.. ఆర్.ఆర్.ఆర్ ఎగ్జిక్యూషన్..!

ఐతే బాహుబలి తరహాలో మహేష్ సినిమా కూడా రెండు భాగాలు చేసేలా జక్కన్న ప్లానింగ్ ఉందని అంతకుముందు వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   4 April 2025 9:41 AM IST
బాహుబలి స్కెచ్.. ఆర్.ఆర్.ఆర్ ఎగ్జిక్యూషన్..!
X

రాజమౌళి సినిమా సెట్స్ మీద ఉంది అంటే బ్నయట ఎన్ని ఊహాగానాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా మొదలు పెడుతున్నారు అనే న్యూసే సెన్సేషన్ అవుతుంది. ఇక సినిమా గురించి ప్రతి క్లూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా ఒడిశాలో జరిగింది.

ఈమధ్యనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఫారిన్ షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో మైథాలజీ టచ్ కూడా ఉంటుందని టాక్. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు.

ఐతే బాహుబలి తరహాలో మహేష్ సినిమా కూడా రెండు భాగాలు చేసేలా జక్కన్న ప్లానింగ్ ఉందని అంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడెన్ గా మహేష్ సినిమా రెండు భాగాలు కాదు ఒక భాగానికే ఫిక్స్ అవుతున్నారని తెలుస్తుంది. బాహుబలి స్కెచ్ తోనే ఎస్.ఎస్.ఎం.బి 29 తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండగా స్కెచ్ బాహుబలి రేంజ్ లోనే ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ తరహాలో ఉంటుందని టాక్.

అంటే సినిమా రెండు భాగాలు కాదు కాస్త లెంగ్త్ ఎక్కువ ఉన్నా ఒక భాగంగానే సినిమా పూర్తి చేస్తారని టాక్. అంతేకాదు సినిమా విషయంలో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నారని తెలుస్తుంది. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా ఎక్కువే ఉండేలా ఉన్నట్టు తెలుస్తుంది. 2027 లో సినిమా రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

ఐతే మహేష్ కూడా రాజమౌళి సినిమాకు పూర్తి డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో తన లుక్, స్టైల్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. మరి రాజమౌళి మహేష్ ఎలాంటి సినిమాతో వస్తారో కానీ ఈ మూవీపై రోజు రోజుకి పెరిగిపోతున్న అంచనాలు చూస్తే బాబోయ్ అనిపించేస్తుంది. 1000 కోట్ల బొమ్మ అది కూడా రాజమౌళి నుంచి మన సూపర్ స్టార్ మహేష్ హీరోగా కాబట్టి కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అన్నది చెప్పడంలో సందేహం లేదు. త్వరలోనే చిత్రయూనిట్ తో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.