మహేష్ బర్త్ డే దాకా వెయిటింగ్ తప్పదా..?
ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా SSMB 29 నుంచి ఏదైనా అప్డేట్ రావొచ్చని టాక్.
By: Tupaki Desk | 13 April 2025 1:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకుండానే లాగిస్తున్నారు.
ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్ ఏంటన్నది అర్థం కావట్లేదు. ఐతే సినిమా అప్డేట్ ఇస్తూ 2 నిమిషాల వీడియో ఒకటి రెడీ చేస్తున్నారని టాక్ వచ్చింది. ఐతే దాని గురించి కూడా క్లారిటీ రాలేదు. ఐతే ఏప్రిల్, మే కాదు ఎస్.ఎస్.ఎం.బి 29 అప్డేట్ కోసం మరో నాలుగు నెలలు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో సినిమా అప్డేట్ ను సూపర్ స్టార్ బర్త్ డే కి ఇస్తారని టాక్.
అంటే ఏప్రిల్, మే కాదు ఏకంగా ఆగష్టు దాకా వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ ఏమో ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి ఏమో తన పంథాలో షూటింగ్ జరుపుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా మహేష్ లుక్స్ ఇంకా లీక్స్ లేకుండా సినిమా చేస్తాడని వార్తలు రాగా ఒడిశాలో లొకేషన్స్ నుంచి కొన్ని వీడియోలు లీక్ అవగా.. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక అఫీషియల్స్ తో మహేష్ దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి.
SSMB 29 సినిమా గురించి రాజమౌళి అండ్ టీం ఎప్పుడు ప్రెస్ ముందుకు వస్తారన్నది చాలా కన్ ఫ్యూజన్ గా ఉంది. ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా SSMB 29 నుంచి ఏదైనా అప్డేట్ రావొచ్చని టాక్. ఐతే ఈలోగా ప్రెస్ ముందుకు రాజమౌళి మహేష్ వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అని మొన్నటిదాకా వార్తలు వచ్చినా ఇప్పుడు కాదు ఆమె మహేష్ పక్కన హీరోయిన్ గానే చేస్తుందని అంటున్నారు. సినిమా గురించి ఒక చిన్న పోస్టర్ వచ్చినా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నారు. ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించేలా ఒక సర్ ప్రైజ్ అప్డేట్ వస్తే సోషల్ మీడియా షేక్ చేయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.
