సూపర్ స్టార్ బర్త్ డే కి సర్ ప్రైజ్ సిద్ధమా..?
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండా నడిపిస్తున్నాడు జక్కన్న.
By: Tupaki Desk | 8 May 2025 2:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండా నడిపిస్తున్నాడు జక్కన్న. ఐతే రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే ఆడియన్స్ అంతా దాని మీద ఫోకస్ చేస్తారు. ఆయన కూడా సినిమా మొదలైనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డీటైల్స్ చెబుతాడు. కానీ SSMB 29 సినిమాకు అలాంటిదేమి లేకుండానే వెళ్తున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఏమో సినిమా గురించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో ఎదురుచూస్తున్నారు.
ఐతే మహేష్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు మహేష్ చేస్తున్న సినిమా అప్డేట్ ఇస్తాడు. మే 31న కృష్ణ జయంతి ఉంది. కాబట్టి సినిమా నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సినిమా నుంచి టీజర్ వదులుతారా లేదా పోస్టర్ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఎస్.ఎస్.ఎం.బి 29 షూటింగ్ చేస్తున్నా ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వివరాలు చెప్పట్లేదు.
అసలు రాజమౌళి ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమా మీద ఉన్న హైప్ తో ఏదైనా పోస్టర్ వదిలినా చాలని కోరుతున్నారు. మహేష్ రాజమౌళి ఈ కాంబో మొదటిసారి సెట్స్ మీదకు వెళ్లింది. తప్పకుండా ఈ ఇద్దరి కెరీర్ బెస్ట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ నిలిచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహేష్ అయితే మొదటిసారి తెలుగు పరిశ్రమ దాటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లాంటి సినిమా చేస్తున్నాడు. సో సూపర్ స్టార్ స్టామినా ఏంటన్నది కూడా చూపించాల్సిన అవసరం ఉంది.
గుంటూరు కారం తర్వాత మహేష్ ఏమాత్రం గ్యాప్ లేకుండా రాజమౌళి సినిమా మొదలు పెట్టాడు. ఐతే జక్కన్న ఈ సినిమా విషయంలో తన దూకుడుతనంతో వెళ్తున్నాడని అనిపిస్తుంది. అంతేకాదు సినిమాను అనుకున్న విధంగా 2 ఏళ్లలో పూర్తి చేసి పర్ఫెక్ట్ టైం కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి సినిమా ఎలా ఉండాలని ఫ్యాన్స్ అనుకుంటారో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ఉండేలా చేయాలని చిత్రయూనిట్ చేస్తున్నారు. మరి SSMB 29 ఫస్ట్ అప్డేట్ తోనే సినిమా లెక్క తేల్చే ఛాన్స్ ఉంది. ఆ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
