రూ.50 కోట్లతో సెట్.. SSMB 29 పక్కా హాలీవుడ్ రేంజ్!
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
By: Tupaki Desk | 20 Jun 2025 3:20 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్ పై ఆడియన్స్, అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం మొత్తం సినీ ప్రియులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మిగతా క్యాస్టింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ.. ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రావడం లేదు.. మేకర్స్ ఇవ్వడం లేదు.
ఏదేమైనా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒడిశాలో, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కెన్యాకు మూవీ టీమ్ వెళ్లనుందని.. అక్కడ మెయిన్ క్యాస్టింగ్ పై భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది.
కానీ ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. సినిమాలో కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో ఉంటాయని, వాటిని షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అది అయ్యాక కెన్యా వెళ్తారని సమాచారం. అయితే కాశీ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ తీసేందుకు ఇప్పుడు హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే అది భారీ కాదు.. అతి భారీ అనాలేమో. ఎందుకంటే.. ఆ సెట్ కోసం అక్షరాల రూ.50 కోట్లు వెచ్చిస్తున్నారట. అది తెలిసి ఒక్కసారిగా అంతా నోరెళ్లబెడుతున్నారు. అంత ఖర్చుతో సెట్టా.. వామ్మో అని కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి ఏదో వేరే లెవెల్ ప్లాన్ వేస్తున్నట్లు ఉన్నారని.. సినిమా రేంజ్ పాన్ ఇండియా కాదని పాన్ వరల్డ్ అని అంటున్నారు.
అదే సమయంలో రూ.50 కోట్ల బడ్జెట్ తో సినిమాలే వస్తుంటాయి.. ఇప్పటికే వచ్చాయి కూడా.. ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తాన్ని సెట్ కోసం ఖర్చుపెడుతున్నారంటే నెవ్వర్ బిఫోర్. హాలీవుడ్ రేంజ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ అతి భారీ సెట్స్ ను వేస్తుంటారు. ఇప్పుడు జక్కన్న.. SSMB 29 మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఆ సెట్ ఎలా ఉంటుందో.. సీన్స్ ఎలా ఉంటాయో మూవీ వచ్చాకే తెలియనుంది.
