SSMB29: 50లో ఇది నెవ్వర్ బిఫోర్ లుక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 మీద బీభత్సమైన హైప్ కొనసాగుతోంది.
By: Tupaki Desk | 20 July 2025 4:41 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 మీద బీభత్సమైన హైప్ కొనసాగుతోంది. ఇండియన్ సినిమా రేంజ్ ను దాటేలా, దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ పోస్టర్ కానీ టీజర్ కానీ విడుదల కాకపోయినా.. సినిమా మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. కథ, విలన్, లొకేషన్స్, మేకింగ్.. ఇలా అన్ని విషయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఇటీవల కనిపించిన ఓ స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంద. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ వెనుక రాజమౌళి మార్క్ ఫీలా ఉందంటూ ఊగిపోతున్నారు.
హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైన మహేష్ బాబు, బ్లాక్ హూడీ మరియు బ్లూ జీన్స్‌లో కనిపించారు. వేవీ హెయిర్, డార్క్ బార్డ్ లుక్‌తో మహేష్ సింప్లీ రాకింగ్‌గా ఉన్నారు. సింపుల్ కాస్ట్యూమ్ లోనూ ఇలా డిఫరెంట్‌గా కనిపించడం ఫ్యాన్స్‌ను శాక్‌కు గురి చేసింది. ఇది SSMB29 సినిమా కోసం చేస్తున్న లుక్ ట్రాన్స్ఫర్మేషన్‌లో భాగమేనని టాక్.
మహేష్ వయసు ఇప్పటికే 50లోకీ వచ్చేసింది. ఈ క్రమంలో పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం అనేది సో స్పెషల్. ఫ్యాన్స్ మాత్రమే కాదు, నెటిజన్లు, సినిమా ప్రేమికులంతా మహేష్ బాబుని ఈ కొత్త లుక్ లో చూసి తెగ మంత్రముగ్ధులైపోతున్నారు. సోషల్ మీడియా అంతా ఆ ఫోటోలతో నిండిపోయింది. ‘రాజమౌళి మిరాకిల్ మొదలైపోయింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ స్టైలిష్ లుక్ చూస్తుంటే SSMB29లో ఆయన పాత్ర ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్టే.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
