SSMB29 నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.
By: Tupaki Desk | 23 May 2025 3:41 PM ISTఆర్ఆర్ఆర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కనీసం అనౌన్స్‌మెంట్ కూడా లేకుండానే సెట్స్ పైకి వెళ్లింది. రాజమౌళి ఈ సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేయాలని డిసైడయ్యాడు. అందులో భాగంగానే ఇప్పటికే జక్కన్న రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేశాడు.
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సమ్మర్ బ్రేక్ లో ఉంది. ఈ గ్యాప్ లో రాజమౌళి లండన్ వెళ్లి అక్కడ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొనగా, మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు విదేశాలకు వెళ్లాడు.
దీంతో ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం రాజమౌళి మరియు అతని టీమ్ ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. జూన్ 1 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఒక స్పెషల్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట జక్కన్న.
హైదరాబాద్ షెడ్యూల్ లో పలు కీలక ఎపిసోడ్స్ ను షూట్ చేసి అది పూర్తయ్యాకే చిత్ర యూనిట్ ఆ నెక్ట్స్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి హైదరాబాద్ లో మొదలవనున్న ఈ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటూ ప్రియాంక చోప్రా కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ కూడా అతి త్వరలోనే విదేశాల నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎక్కువగా ఆఫ్రికాలోని కొన్ని ప్రదేశాల్లో జరగనుంది. రాజమౌళి మరియు అతని టీమ్ ఇప్పటికే లొకేషన్స్ ను వెతికి లాక్ చేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
