రాజమౌళి ఫామ్‌హౌస్‌లో సంథింగ్ ఏదో జరుగుతోంది
అదే సమయంలో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 100 మందికి పైగా స్టంట్ మెన్ల తో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 27 July 2025 10:35 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన అభిరుచికి అనుగుణంగా నగరానికి దూరంగా కొన్ని ఎకరాల్లోని ఫామ్ హౌస్ ని కొనుగోలు చేసి, అక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని గతంలో కథనాలొచ్చాయి. బస్తీ జీవితానికి భిన్నంగా ప్రశాంతంగా గడపాలనేది ఆయన ఆలోచన. తాజా సమాచారం మేరకు.. రాజమౌళి ఫామ్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా ఏదో సంథింగ్ జరుగుతోంది.
ఓవైపు మహేష్ బాబు సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసేందుకు రాజమౌళి పక్కా ప్రణాళికల్ని రచిస్తున్నారు. మరోవైపు పాటల రికార్డింగ్ తో పాటు, ఫైట్స్ చిత్రీకరణను కూడా సూపర్ వైజ్ చేస్తున్నారని సమాచారం. తాజాగా అందిన సమాచారం మేరుకు... రాజమౌళి ఫామ్ హౌస్ లోని స్టూడియోలో పాటల రికార్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే మరకతమణి ఎం.ఎం.కీరవాణి రికార్డింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు.
అదే సమయంలో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 100 మందికి పైగా స్టంట్ మెన్ల తో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా టాంజానియాలో భారీ షెడ్యూల్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవల కెన్యా షెడ్యూల్ డిస్ట్రబ్ అయ్యాక రాజమౌళి ప్రతిదీ ఆచితూచి ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి అత్యంత కీలకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కించడం కోసం టాంజానియా వెళుతున్నారు.
ఆఫ్రికన్ షెడ్యూల్ ఆగస్టు రెండవ వారంలో ప్రారంభం కానుంది. మహేష్- ప్రియాంక చోప్రా జంటగా రాజమౌళి రూపొందిస్తున్న SSMB29 జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా- కోరాపుట్ లలో కీలక షెడ్యూల్ పూర్తయింది. ఆసక్తికరంగా ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి ఒకేసారి పాటల రికార్డింగ్ తో పాటు, ఫైట్స్ చిత్రీకరణను ప్రారంభిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
