Begin typing your search above and press return to search.

SSMB29: డైనోసార్స్ అంటున్నారంటే..

మహేష్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 April 2025 4:27 PM IST
SSMB29 Updates
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు రాజమౌళి SSMB29 మూవీ ఇప్పుడు రికార్డుల దిశగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో దూసుకెళ్తోంది బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వల్డ్ సినిమా తీసిన రాజమౌళి, ఈసారి మరింత విభిన్నంగా 1000 కోట్ల ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ అడ్వెంచర్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఎమోషన్, యాక్షన్, విజువల్స్ అన్నింటిని కలగలిపే విధంగా కథను మలిచారని సమాచారం.

మహేష్ బాబు కూడా తన కెరీర్‌లో ఇలా యాక్షన్ థ్రిల్లర్ కథ చేయడం ఇదే తొలిసారి. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా హీరో పాత్ర చాలా బలంగా డిజైన్ చేసినట్టు సమాచారం. కథ అంతా అడవి నేపథ్యంలో సాగుతుంది. అడవి అనగానే.. అడ్వెంచర్‌కు, విజువల్ థ్రిల్‌కు అవకాశం ఎక్కువ. అందుకే రాజమౌళి దాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. మహేష్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఒక కొత్త గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథలో డైనోసార్స్ కూడా ఉంటాయట. డైనోసార్స్ చుట్టూ కొన్ని కీలక ఎపిసోడ్స్ సాగనున్నాయట. డైనోసార్స్ మహేష్‌ను ఛేజ్ చేయడం, హీరో వాటి నుంచి తప్పించుకోవడం.. అలాగే వాటితో యాక్షన్ ఎలివేషన్స్ వచ్చే సీన్ ఓ ఇంటెన్స్ క్లైమాక్స్‌కు దారి తీస్తుందన్నది టాక్. అంటే కథ ఏదో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే అవకాశం ఉంది.

డైనోసార్ కాలానికి టైమ్ ట్రావెల్ అవుతారా, లేదంటే ఏదైనా మిస్టరీ మ్యాజిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుందా అనేది క్యూరియసిటీని కలిగిస్తోంది. ఏదో ఒక ఇంటెన్స్ టెక్నికల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉండనుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కోసం భారీగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట. వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారని ఇండస్ట్రీ టాక్. సుమారు 4-5 డైనోసార్ బేస్డ్ ఎపిసోడ్లు సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, సినిమా వాతావరణం చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా ఓ మైల్‌స్టోన్ యాక్షన్ అడ్వెంచర్ కావడం ఖాయం. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా ఫృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. తండ్రి కొడుకుల ఎమోషన్ ఈ కథలో బలంగా ఉండబోతోందట. ఓ ప్రముఖ నటుడు తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతని పేరును మాత్రం చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ కావచ్చని భావిస్తున్నారు. KL నారాయణ నిర్మిస్తున్న ఈ మాస్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ కు కీరవాణి సంగీత అందిస్తున్నాడు. ఇక సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.