ఎస్ ఎస్ ఎంబీ 29 లో విలన్ నల్ల జాతీయుడా?
SSMB29 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూలు పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ కి రంగం సిద్దమవుతోంది.
By: Tupaki Desk | 24 April 2025 8:45 AM ISTSSMB29 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూలు పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ కి రంగం సిద్దమవుతోంది. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ జరుగుతుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపై ఒకటే సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే విలన్ గా మలయాళం నటుడు పృధ్వీరాజ్ కుమార్ నటిస్తున్నాడు. మరి గ్లోబల్ మూవీలో అసలైన విలన్ పృధ్వీరాజ్ నా? అంటే కాదనే కొత్త మాట తెరపైకి వస్తోంది.
మహేష్ ని బలంగా ఢీ కొట్టే అసలైన ప్రతి నాయకుడు మరోకరు ఉన్నారని వెలుగులోకి వస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తోన్న నేపథ్యంలో విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలని రాజమౌళి ఇంతవరకూ లీక్ చేయని మరో విషయం తెరపైకి వస్తోంది. ఇందులో మెయిన్ విలన్ ఓ నల్ల జాతీయుడని సమాచారం. హాలీవుడ్ లో నటించిన ఓ నల్ల జాతీయుడిని రంగంలోకి దించుతున్నారని తెలిసింది.
ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన విలన్ అయితే? సినిమాకు మరింత హైప్ వస్తుందని జక్కన్న ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. అయితే ఆ నటుడు ఎవరు? అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రతి నాయకుడి పాత్ర విషయంలో ఇలాంటి సీక్రెట్ అండ్ సస్పెన్స్ మెయింటెన్ చేయడం అన్నది జక్కన్నకే చెల్లింది.
`బాహుబలి`లో కాలకేయ పాత్రను పోషించింది ప్రభాకర్. నిజానాకి ప్రభాకర్ అప్పటివరకూ చిన్న చిన్న పాత్రలే పోషించాడు. కానీ `బాహుబలి`తో అతడికి మంచి హైప్ వచ్చింది. అంతకు ముందు` విక్రమార్కుడు` విలన్ తిట్లా పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ పోషించాడు. ఆ సినిమా కూడా అజయ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలోనూ అసలైన విలన్ పాత్రలు పోషించింది తెల్ల వారే. వాళ్ల వివరాలేవి రాజమౌళి సినిమా రిలీజ్ కు ముందు ఇవ్వలేదు. ఎస్ ఎస్ ఎంబీ 29 విషయంలోనూ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు.
